Fenugreek Leaves: శీతాకాలంలో మెంతి కూర రోజూ తింటే బోలెడన్ని ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

ఆకు కూరలు ఏవైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో మెంతి కూర ఒకటి.. మెంతి కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మెంతి కూరను ముఖ్యంగా శీతాకాలంలో తింటే చాలామంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Fenugreek Leaves: శీతాకాలంలో మెంతి కూర రోజూ తింటే బోలెడన్ని ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Fenugreek Leaves
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 19, 2022 | 9:05 AM

Fenugreek Leaves Benefits: ఆకు కూరలు ఏవైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో మెంతి కూర ఒకటి.. మెంతి కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మెంతి కూరను ముఖ్యంగా శీతాకాలంలో తింటే చాలామంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మెంతికూరను.. ఎన్నో రకాల ఆహార పదార్థాల్లో వినియోగిస్తారు. పూరీలు, పప్పులు, మొదలైన కూరగాయల్లో చేర్చి ఇష్టంతో ఆరగిస్తారు. ఇంకా మెంతి గింజలను కూడా ఎక్కువగా తీసుకుంటారు. అయితే, మెంతి ఆకులు ఆహారపు రుచిని పెంచడంతోపాటు.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మెంతి కూరలో క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫాస్పరస్ ఉంటాయి. దీని వల్ల మెంతి ఆకులు తేలికగా ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేస్తాయి. అటువంటి పరిస్థితిలో.. చలికాలంలో మెంతి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో మెంతి కూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

బరువును తగ్గిస్తుంది: మెంతి ఆకులు శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. వాస్తవానికి చలికాలంలో బరువు పెరుగుతుందని చాలా మంది పేర్కొంటుంటారు. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించడానికి, ఆహారంలో మెంతి ఆకులను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఎందుకంటే మెంతి ఆకుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది: మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో చలికాలంలో సాధారణంగా మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని నియంత్రించాలంటే మెంతికూరను ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకోండి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయి. మెంతి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను తొలగించడంలో సహాయపడతాయి. ఇంకా మెంతి ఆకులను పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసినా.. చాలా మంచిది. మెంతి కూర ప్యాక్.. మచ్చలను, టాన్ తొలగించడంలో సహాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..