Lima Airport: విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం.. అంతలోనే దారుణం..
పెరూలోని లిమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన లాటం ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై ఫైర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానంలోని
పెరూలోని లిమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన లాటం ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై ఫైర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, అయితే ఫైర్ ట్రక్కులో ఉన్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారని, మరో ఉద్యోగి గాయపడ్డాడని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన ఎయిర్ బస్ ఎ 320 నియో విమానంలో 102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం నుంచి ప్రయాణికులందరినీ సురక్షితంగా దించామని విమానాశ్రయం అధికారులు చెప్పారు.అగ్నిమాపక సిబ్బంది కుటుంబాలకు అధ్యక్షుడు పెడ్రో సంతాపం తెలిపారు. విమానం లిమా నుంచి పెరువియన్ నగరమైన జూలియాకాకు వెళుతుండగా రన్ వేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అనంతరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు.ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు.
లోయలో పడ్డ బస్సు..
ఇదిలాఉంటే.. పెరూలో బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది మృతి చెందారు. మరో 34 మంది గాయపడ్డారు. అంకాష్ ప్రాంతంలో బస్సు బోల్తా పడి 330 అడుగులు లోయలో పడడంతో ఈ ప్రమాదం జరిగిందని సివిల్ డిఫెన్స్ తెలిపింది. బస్సు ప్రధాన తయా బాంబా హైవే మీదుగా లా లిబర్టాడ్ ఉత్తర ప్రాంతం నుండి లిమాకు వెళుతోంది. అంకాష్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 34 మంది గాయపడినట్లు మరియు 11 మంది అధికారులు చెబుతున్నారు.పోలీసులు, స్థానికులు మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. గాయపడిన వారిని సిహువాస్ ప్రావిన్స్‌లోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
EN VIVO | Ambulancias del SAMU llegan al aeropuerto Jorge Chávez para brindar asistencia a personas que hayan resultado heridas tras choque de avión contra camión ►https://t.co/bZQ8RxSU6D pic.twitter.com/hi3qusi8zk
— TVPerú Noticias (@noticias_tvperu) November 18, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..