ఇరాన్‌లో నిరసనకారులపై విరుచుకుపడ్డ ఉగ్రమూక.. ఐదుగురు మృతి!

ఇరాన్‌లో హిజాబ్‌ వివాదం మరింత ముదురుతోంది. సెప్టెంబర్‌ 16న మహ్సా అమీని మరణం తర్వాత ఆ దేశ యువత హిజాబ్‌కు వ్యతిరేకంగా గళంవిప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు భారీ సంఖ్యలో..

ఇరాన్‌లో నిరసనకారులపై విరుచుకుపడ్డ ఉగ్రమూక.. ఐదుగురు మృతి!
5 killed after armed men open fire in iran
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 18, 2022 | 6:46 AM

ఇరాన్‌లో హిజాబ్‌ వివాదం మరింత ముదురుతోంది. సెప్టెంబర్‌ 16న మహ్సా అమీని మరణం తర్వాత ఆ దేశ యువత హిజాబ్‌కు వ్యతిరేకంగా గళంవిప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు భారీ సంఖ్యలో రోడ్ల మీదకు చేరి నిరసనలు తెలుపుతున్నారు. ఇక ప్రభుత్వం అగ్నికి ఆజ్యం పోసినట్లు ఎక్కడికక్కడ నిరసనకారులను అణచివేత చర్యలకు పూనుకుంటోంది. అనేకమందిని అరెస్టు చేసి, శిక్షిస్తోంది. షిరాజ్‌లోని షా చెరాగ్ సమాధిపై అక్టోబర్ 26న ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చేసిన దాడిలో దాదాపు 13 మంది మరణించారు. గడచిన రెండు నెలల్లో తలెత్తిన ఘర్షనల్లో డజన్ల కొద్దీ మరణాలు చోటుచేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో ఆందోళన తెలుపుతున్న గుంపుపై ఉగ్రవాద మూక తాజాగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పది మంది తీవ్రంగా గాయపడినట్లు ఈ దేశ మీడియా వెల్లడించింది. మృతులలో ఓ మహిళా, ఓ చిన్నారి కూడా ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థ ప్రకటన విడుదల చేయలేదు. 2 మోటార్‌ సైకిళ్లపై వచ్చిన దుండగులు నిరసనకారులు, సెక్యురిటీ ఫోర్స్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే