Amazon Job Cuts: ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ నుంచి వేల మంది ఉద్యోగుల తొలగింపు.. సంఖ్య ఇంకా పెరిగే అవకాశం..

ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్‌ ఉద్యోగులను తొలగించబోతుందని వచ్చిన వార్తలు బుధవారం నిజం అయ్యాయి.  కొంత మందిని ఉద్యోగం నుంచి తొలగించిన అమెజాన్ తన రిటైల్ విభాగం, మానవ వనరులతో సహా..

Amazon Job Cuts: ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ నుంచి వేల మంది ఉద్యోగుల తొలగింపు.. సంఖ్య ఇంకా పెరిగే అవకాశం..
Amazon
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 17, 2022 | 1:16 PM

ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్‌ ఉద్యోగులను తొలగించబోతుందని వచ్చిన వార్తలు బుధవారం నిజం అయ్యాయి.  కొంత మందిని ఉద్యోగం నుంచి తొలగించిన అమెజాన్ తన రిటైల్ విభాగం, మానవ వనరులతో సహా మరో 10,000 మందిని తీసేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంసెనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్‌ సహా అనేక మీడియా సంస్థలు సోమవారం.. అమెజాన్ ఉద్యోగులను కోత కోయబోతుందని ప్రచురించిన వార్తలన్నింటినీ ఆ కంపెనీ నిజం చేసింది. ఎందరో నిరుద్యోగులకు అమెజాన్ ఉద్యోగాలు కల్పిస్తుందనుకుంటున్న సమయంలో, ఆ కంపెనీ వేలమందిని రోడ్డున పడేసింది.

అమెజాన్ ఎగ్జిక్యూటివ్ డేవ్ లింప్ ‘‘మా కంపెనీ తన పరికరాల యూనిట్‌ను గ్రూప్‌లను అనుసంధానం చేయాలినుకుంటుంది. కస్టమర్ల అభిప్రాయాల కారణంగానే ఈ నిర్ణయానికి కంపెనీ వచ్చింది. ఇంకా అమెజాన్ ఇప్పుడు సాధారణమైన, అనిశ్చిత స్థూల ఆర్థికపరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో.. మా కస్టమర్‌లకు, వ్యాపారానికి మరింత ప్రాధాన్యతనిచ్చేందు కొన్ని నెలలుగా పని చేస్తున్నాము’’ అని ఓ బ్లాగ్ ద్వారా తెలియజేశారు.

అయితే యూజర్లు అడిగే ప్రశ్నలను అలెక్సా ఎన్‌కోడ్ చేసి, వారు ఆశించే తెలివైన సమాధానాలను ఇవ్వడంలో అమెజాన్ కష్టపడుతుండగా.. ఆల్ఫాబెట్, గూగుల్, ఓపెన్ఏఎల్ చాట్‌బాట్‌లలో ముందుస్థానంలో ఉన్నాయని అనేక వార్తాకథనాలు వస్తున్నాయి. ఇక ఇప్పడు అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. పెరుగుతున్న కార్పొరేట్ నియామకాలు కూడా స్తంభించిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..