AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్‌ను మన దేశంలోనూ చూడవచ్చు.. ఆ వివరాలు మీ కోసం..

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఫిఫా ప్రపంచకప్ ఖతర్ వేదికగా ఈ నెలలో ప్రారంభమవబోతుంది. ప్రతి నాలుగు సంవత్సారాలకు ఒక సారి మే-జులై మధ్య కాలంలో నిర్వహించబడే ఈ ఫుట్‌బాల్..

FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్‌ను మన దేశంలోనూ చూడవచ్చు.. ఆ వివరాలు మీ కోసం..
Fifa World Cup 2022
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 17, 2022 | 12:37 PM

Share

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఫిఫా ప్రపంచకప్ ఖతర్ వేదికగా ఈ నెలలో ప్రారంభమవబోతుంది. ప్రతి నాలుగు సంవత్సారాలకు ఒక సారి మే-జులై మధ్య కాలంలో నిర్వహించబడే ఫిఫా ప్రపంచకప్ ఖతర్ 2022 ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఈ ఏడాదే మొదటిసారిగా నవంబర్-డిసెంబర్‌లో జరగనుంది. 2018 ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో విజేతగా నిలిచిన ఫ్రాన్స్.. జరగబోయే లీగ్‌లోనూ తన సత్తా చాటి కప్‌ను తన వద్దే నిలుపుకోవాలని యోచిస్తోంది. కానీ అందుకు అడ్డుగా బ్రెజిల్, బెల్జీయం, అర్జెంటీనా టీమ్‌లు నిలవబోతున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను చూసి అనందించాలని ఫుట్‌బాల్ అభిమానులంతా ఉత్సాహపడుతున్నారు. అయితే, ఫుట్‌బాల్ ఆటలో లెజెండ్‌లు అయిన మెస్సీ, రోనాల్డోకి ఇదే చివరి ప్రపంచకప్ కానుంది. చివరి సారిగా అయినా వారి ఆటను చూసి తరించాలని ఎందరో ఫుట్‌బాల్ అభిమానులు కోరుకుంటున్నారు.

మొత్తం 29 రోజుల పాటు జరిగే ఈ ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మొత్తం 32 జట్లు పాల్గొని.. 64 నాలుగు మ్యాచ్‌లు ఆడతాయి. టోర్నమెంట్‌లో జట్లన్నీ ఎనిమిది గ్రూప్‌లుగా తలపడనున్నాయి.

గ్రూప్ ఏ: ఖతర్, ఈక్వేడర్, సెనేగల్, నెదర్లాండ్స్

ఇవి కూడా చదవండి

గ్రూప్ బీ: ఇంగ్లాండ్, ఇరాన్, అమెరికా, వేల్స్

గ్రూప్ సీ: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్

గ్రూప్ డీ: ఫ్రాన్స్, అస్ట్రేలియా, డెన్మార్క్, తునీషియా

గ్రూప్ ఈ: స్పెయిన్, కోస్టారికా, జెర్మనీ, జపాన్

గ్రూప్ ఎఫ్: బెల్జీయం, కెనడా, మొరాకో, క్రొయేసియా

గ్రూప్ జీ: బ్రెజిల్, సెర్బీయా, స్విట్జర్లాండ్, కెమరూన్

గ్రూప్ హెచ్: పోర్చుగల్, గానా, యురుగ్వే, సౌత్ కొరియా

స్పోర్ట్స్18, స్పోర్ట్స్18 హెచ్‌డీ చానల్‌లో టోర్నమెంట్ మ్యాచ్‌లు ప్రసారమవుతాయి. ఫుట్‌బాల్ అభిమానులు మన దేశంలోనూ తక్కువేం కాదు. వారందరి కోసమే జియోసినిమా యాప్‌ ఫిఫా ప్రపంచకప్‌ను ప్రసారం చేయనుంది. డిసెంబర్ 3 మొదటి నాకౌట్ రౌండ్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 9న క్వార్టర్ ఫైనల్స్, డిసెంబర్ 13న సెమీఫైనల్స్ జరుగుతాయి.  సెమీఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు డిసెండర్ 17న కలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. డిసెంబర్ 18(ఖతర్ నేషనల్ డే)న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. ఖతర్‌లోని దోహా నగరానికి 15 కి.మీ దూరంలో ఉన్న లూసెయిల్ ఐకానిక్ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం.. ఈ లింక్ మీద క్లిక్ చేయండి..