AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Australia Floods: భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న ఆస్ట్రేలియా.. నిరాశ్రయలైన వేలాదిమంది..

ఆస్ట్రేలియాను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి ఫ్లాష్‌ ఫ్లడ్స్‌. రెండ్రోజుల నుంచి ఉరుములు, మెరుపులతో కుండపోత

Australia Floods: భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న ఆస్ట్రేలియా.. నిరాశ్రయలైన వేలాదిమంది..
Australia Rains
Shiva Prajapati
|

Updated on: Nov 17, 2022 | 9:24 AM

Share

ఆస్ట్రేలియాను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి ఫ్లాష్‌ ఫ్లడ్స్‌. రెండ్రోజుల నుంచి ఉరుములు, మెరుపులతో కుండపోత వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది ఇళ్లు నీటమునిగిపోయాయి. దీంతో ఇళ్ల పైకప్పులు, చెట్లపైకెక్కి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు గడుపుతున్నారు స్థానికులు. వరదలు ముంచెత్తడంతో ప్రభుత్వం సహాయకచర్యలు చేపట్టింది.

హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా వందలాది మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో తాము ఇంకా బతికి ఉండటం తమ అదృష్టమంటున్నారు స్థానికులు. సదరన్‌ టేబుల్‌ ల్యాండ్స్‌లోని ట్యూనాలో 165మి.మీ, ఫోర్బ్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో 127మి.మీ, విక్టోరియా, మౌంట్‌ హోథమ్‌లో 144మి.మీ, టాలండూన్‌లో 133మిల్లీమీట్లర్ల వర్షపాతం నమోదైంది. యూగోరాలో సడెన్‌గా నీటిమట్టం పెరిగింది. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తింది. నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఎన్నడూ లేని విధంగా ప్రమాదకరంగా మారాయి ప్రాజెక్టులు. ఉప్పొంగుతున్న వరదనీరు పలు ప్రాంతాలను ముంచెత్తింది.

ఫోర్బ్స్‌లో 1952 తర్వాత..అంటే 70ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదైంది. లాచ్లాన్‌ నది ఉప్పొంగుతోంది. ఊహించిన దానికంటే వరద వేగంగా పెరగడంతో 2గంటల్లోనే స్థానికులు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. న్యూ సౌత్ వేల్స్ చరిత్రలో అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిన ప్రభుత్వం..అదనంగా సిబ్బందిని మోహరించింది. ఇక ముర్రం బిడ్జీ నదికి వరద పోటెత్తడంతో..గరిష్ట స్థాయిని దాటి ప్రవహిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..