Smart Phone: తక్కువ ధరకే 5G ఫోన్ కావాలా? అద్దిరిపోయే ఫీచర్స్‌ కలిగిన 7 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మీకోసం..

భారతదేశంలో 5జి నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న టెలికాం సంస్థలు.

Smart Phone: తక్కువ ధరకే 5G ఫోన్ కావాలా? అద్దిరిపోయే ఫీచర్స్‌ కలిగిన 7 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మీకోసం..
5g Smart Phones
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 16, 2022 | 5:30 PM

భారతదేశంలో 5జి నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న టెలికాం సంస్థలు. అయితే, 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. చాలా మంది 5జి సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అయితే, కొన్ని 5జి సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్స్ భారీ ధర ఉన్నాయి. అదే సమయంలో కొన్ని మొబైల్ కంపెనీలు సామాన్యులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ ధరకే 5జి సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. రూ. 20 వేల కంటే తక్కువ ధర మాత్రమే కాకుండా మంచి ఫీచర్స్‌ కలిగిని 7 స్మార్ట్ ఫోన్ల జాబితాను ఇప్పుడు మనం చూద్దాం..

రూ. 20 వేల లోపు 5జి స్మార్ట్ ఫోన్స్ లిస్ట్..

1. Samsung Galaxy M13 5G..

ప్రముఖ ఆన్‌లైన్ ఈకామర్స్ సైట్ అమేజాన్‌లో ఈ ఫోన్ ధర రూ. 13,999 గా ఉంది. ఈ ఫోన్ 4GB + 64GB & 6GB + 128GB రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

ఫీచర్స్..

స్క్రీన్: 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే.

ఇవి కూడా చదవండి

బ్యాటరీ: 5000mAh లిథియం-అయాన్ బ్యాటరీ.

కెమెరా: బ్యాక్- డ్యూయల్ కెమెరా సెటప్- (50MP ప్రధాన + 2MP మాక్రో), 5MP ఫ్రంట్ కెమెరా.

OS: ఆండ్రాయిడ్ 12.

ర్యామ్: 4GB & 6GB.

3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది.

5G సపోర్ట్ బ్యాండ్‌లు: N1(2100), N3(1800), N5(850), N7(2600), N8(900), N20(800), N28(700), N38(2600), N40(2300), N41 (2500), N78(3500).

2. Oppo A74 5G..

దీని ధర రూ. 14,990తో ప్రారంభం అవుతుంది. Oppo A74 5G పెద్ద స్క్రీన్, ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీ కూడా ఎక్కువగానే ఉంది.

ఫీచర్స్..

స్క్రీన్: 6.5-అంగుళాల FHD+ హైపర్-కలర్ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో పంచ్-హోల్ డిస్‌ప్లే.

బ్యాటరీ: 5000mAh Li-Po బ్యాటరీ.

కెమెరా: బ్యాక్- ట్రిపుల్ కెమెరా సెటప్- (48MP ప్రధాన + 2MP మాక్రో + 2MP డెప్త్ లెన్స్), 8MP ఫ్రంట్ కెమెరా.

OS: ఆండ్రాయిడ్ 11 ఆధారంగా కలర్ OS 11.1.

ర్యామ్: 6GB.

ఆడియో జాక్ 3.5 మి.మీ.

5G సపోర్టెడ్ బ్యాండ్‌లు: డ్యూయల్-స్టాండ్‌బై (5G+5G)- n1/28A/41/77/78.

3.Redmi 11 Prime 5G..

దీని ధర రూ. 13,999 నుంచి ప్రారంభమవుతుంది. తక్కువ ధరకే 5జి కనెక్టివిటితో మంచి ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది.

ఫీచర్స్..

స్క్రీన్: 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల FHD+ డాట్ డిస్‌ప్లే.

బ్యాటరీ: 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh Li-Po బ్యాటరీ.

కెమెరా: బ్యాక్- డ్యూయల్ కెమెరా సెటప్- (50MP AI మెయిన్ + 2MP డెప్త్ సెన్సార్), 8MP AI-సెల్ఫీ కెమెరా.

OS: MIUI 13 Android 12 ఆధారంగా పని చేస్తుంది.

ర్యామ్: 4GB & 6GB.

ఆడియో జాక్ 3.5 మి.మీ.

5G సపోర్టెడ్ బ్యాండ్‌లు: n1/ n3/ n5/ n8/ n28/ n40/ n78.

4. Redmi Note 11T 5G..

ధర రూ.17,999 నుండి ప్రారంభమవుతుంది. 20 వేల లోపు మరొక మంచి 5G ఫోన్ ఇది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

స్పెసిఫికేషన్లు..

స్క్రీన్: 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD+ డాట్ డిస్‌ప్లే.

బ్యాటరీ: 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh Li-Po బ్యాటరీ.

కెమెరా: బ్యాక్- డ్యూయల్ కెమెరా సెటప్- (50MP AI మెయిన్ + 8MP అల్ట్రా-వైడ్), 16MP ఫ్రంట్ కెమెరా.

OS: ఆండ్రాయిడ్ 11 MIUI 12.5.

ర్యామ్: 6GB & 8GB.

ఆడియో జాక్ 3.5 మి.మీ.

5G సపోర్ట్ బ్యాండ్‌లు: n1/ n3/ n5/n8/ n28/ n40/ n78.

5. iQOO Z6 5G..

దీని ధర ఆన్‌లైన్‌లో రూ. 15,499 గా ఉంది. 6nm క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే, 5000 mAh బ్యాటరీతో రోజంతా బ్యాటరీ లైఫ్ ఉంటుంది.

స్పెసిఫికేషన్లు..

స్క్రీన్: 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ డిస్‌ప్లే.

బ్యాటరీ: 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 5000mAh లిథియం-అయాన్ బ్యాటరీ.

కెమెరా: బ్యాక్-ట్రిపుల్ కెమెరా సెటప్- (50MP ఐ AF మెయిన్ + 2MP బోకె +2MP మాక్రో), 16MP ఫ్రంట్ కెమెరా .

OS: Funtouch OS 12 Android 12 ఆధారంగా.

ర్యామ్: 4GB, 6GB, & 8GB.

ఆడియో జాక్ 3.5 మి.మీ.

5G సపోర్ట్ బ్యాండ్‌లు: n77/n78.

6. iQOO vivo Z5 5G..

దీని ధర ఆన్‌లైన్‌లో 18,990 గా ఉంది. iQOO vivo Z5 20,000 లోపు శక్తివంతమైన 5G ఫోన్. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G 5G ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అద్భుతమైన డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన బ్యాటరీతో వస్తుంది.

స్పెసిఫికేషన్లు..

స్క్రీన్: 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.66-అంగుళాల FHD+ డిస్‌ప్లే.

బ్యాటరీ: 44W ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో 5000mAh లిథియం-అయాన్ బ్యాటరీ.

కెమెరా: బ్యాక్-ట్రిపుల్ కెమెరా సెటప్- (64MP AF మెయిన్ +8MP అల్ట్రా-వైడ్ + 2MP మాక్రో లెన్స్), 16MP ఫ్రంట్ కెమెరా.

OS: Funtouch OS 12 Android 11 ఆధారంగా పని చేస్తుంది.

ర్యామ్: 8GB

ఆడియో జాక్ 3.5 మి.మీ.

5G సపోర్ట్ బ్యాండ్‌లు: n77/n78

7. Samsung Galaxy M33 5G..

5G ఫోన్‌కి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే 16,999 (6GB + 128GB) నుండి ప్రారంభమయ్యే Samsung Galaxy M33 బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. శక్తివంతమైన బ్యాటరీ, స్టోరేజీ కెపాసిటీ దీని సొంతం. పైగా అదిరిపోయే కెమెరా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

స్పెసిఫికేషన్లు..

స్క్రీన్: 120Hz రిఫ్రెష్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.6-అంగుళాల FHD+ డిస్‌ప్లే.

బ్యాటరీ: 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6000mAh లిథియం-అయాన్ బ్యాటరీ.

కెమెరా: బ్యాక్-క్వాడ్ కెమెరా సెటప్- (50MP ప్రధాన + 5MP అల్ట్రా-వైడ్ + 2MP మాక్రో + 2MP డెప్త్ లెన్స్), 8MP ఫ్రంట్ కెమెరా.

OS: Android 12, One UI 4.

ర్యామ్: 6GB & 8GB వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఆడియో జాక్ 3.5 మి.మీ .

5G సపోర్టెడ్ బ్యాండ్‌లు: N1(2100), N3(1800), N5(850), N7(2600), N8(900), N20(800), N28(700), N66(AWS-3), N38(2600) , N40(2300), N41(2500), N78(3500).

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..