Moon Mission: విజయవంతంగా నాసా మూన్‌ మిషన్‌.. జాబిల్లి వైపు దూసుకెళ్లిన ఆర్టెమిస్‌-1.. ముచ్చటగా ఇది మూడోసారి

ముచ్చటగా మూడోసారి సక్సెసైంది నాసా. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆర్టెమిస్‌-1ను విజయవంతంగా ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ స్టేషన్‌ నుంచి ఆర్టెమిస్‌ నింగికి దూసుకెళ్లింది.

Moon Mission: విజయవంతంగా నాసా మూన్‌ మిషన్‌.. జాబిల్లి వైపు దూసుకెళ్లిన ఆర్టెమిస్‌-1.. ముచ్చటగా ఇది మూడోసారి
Nasa's Artemis 1 Moon Mission
Follow us

|

Updated on: Nov 16, 2022 | 8:14 PM

ఎట్టకేలకు నాసా మూన్‌ మిషన్‌ విజయవంతంగా ప్రారంభమైంది. ముచ్చటగా మూడోసారి ఆర్టెమిస్‌-1 గాల్లోకి ఎగిరింది. 100 మీటర్ల పొడవైన ఈ రాకెట్‌..ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి నిప్పులు చెరుగుతూ జాబిల్లి వైపు దూసుకెళ్లింది. కొన్ని నిమిషాల అనంతరం ఓరియన్ అంతరిక్ష నౌకను చంద్రుని వైపు విడిచిపెట్టింది రాకెట్‌. ఈ ప్రయోగం మొత్తం 25రోజుల పాటు కొనసాగుతుంది. ఐతే ముందుగా ఈ ఏడాది ఆగస్ట్‌ 29, సెప్టెంబర్‌ 3న ప్రయోగానికి సిద్ధమైంది నాసా..కానీ చివరి నిమిషంలో లీకేజీలతో పాటు పలు సమస్యలతో వాయిదా పడింది. ఈసారి కూడా కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమించి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌..

ఓరియన్‌ క్యాప్సూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు ..ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ SLSను తయారు చేసింది నాసా. చంద్రుడిపై మున్ముందు చేపట్టబోయే మిషన్‌ల కోసం..ముందుగా మానవరహిత ప్రయోగాన్ని చేపట్టింది. ఇది సక్సెసైతే మానవ సహిత ప్రయోగాలు చేపట్టేందుకు ప్లాన్‌ చేస్తోంది.

50ఏళ్ల తర్వాత నాసా మూన్‌ మిషన్‌

1972 లో చివరిసారిగా చంద్రుడిపైకి అపోలో మిషన్‌ ద్వారా వ్యోమగాములను పంపింది నాసా. 1969 నుంచి మొత్తం 24మంది వ్యోమగాములను పంపింది నాసా. వారిలో 12మంది జాబిల్లిపై కాలు మోపారు. చంద్రుడి మీదకు చివరిసారిగా మనుషులు వెళ్లి వచ్చిన నాసా అపోలో 17 మిషన్‌కు ఈ ఏడాది డిసెంబర్‌లో 50 ఏళ్లు పూర్తవుతాయి. ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత చేపట్టిన ఈ మూన్ మిషన్‌కు..‘ఆర్టిమిస్ ప్రోగ్రామ్’ అని పేరు పెట్టింది నాసా. ఇందులో భాగంగా ఇవాళ ఆర్టిమిస్‌-1ను ప్రయోగించారు. ఈ ఆర్టిమిస్ ప్రయోగాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతోంది నాసా.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం