Yadadri Temple: యాదాద్రీశుడి పూలతో అగరబత్తులు.. వాగ్మీ బ్రాండ్‌ పేరుతో మార్కెట్లో విక్రయాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ప్రత్యేకంగా అలంకరణ పూలకోసం పూలతోట ఉన్నట్టుగా, యాదాద్రి నరసింహస్వామివారికి కూడ త్వరలో పూలతోటను ఏర్పాటు చేయబోతున్నారు. అలా స్వామి అమ్మవార్లకు వినియోగించిన పూలతో అగరుబత్తులను తయారు చేస్తున్నారు.

Yadadri Temple: యాదాద్రీశుడి పూలతో అగరబత్తులు.. వాగ్మీ బ్రాండ్‌ పేరుతో మార్కెట్లో విక్రయాలు
Yadadri Temple
Follow us
Basha Shek

|

Updated on: Nov 17, 2022 | 8:37 AM

కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలతో సమానంగా యాదాద్రిలో ఆలయ నిర్మాణం, మాఢవీధులు, స్వామివారి పూజ కైంకర్యాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, ప్రసాదాలు చేయిస్తూ మరో తిరుమలగా రూపుదిద్దారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ప్రత్యేకంగా అలంకరణ పూలకోసం పూలతోట ఉన్నట్టుగా, యాదాద్రి నరసింహస్వామివారికి కూడ త్వరలో పూలతోటను ఏర్పాటు చేయబోతున్నారు. అలా స్వామి అమ్మవార్లకు వినియోగించిన పూలతో అగరుబత్తులను తయారు చేస్తున్నారు. వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా యాదాద్రి కొండ పైన ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రయాలు జరిపిస్తున్నారు. దీంతో ఆధ్యాత్మికతతో పాటు రాష్ట్ర అభ్యున్నతిలో మేము సైతం అంటున్న మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న దిశగా స్వయం ఉపాధి కలిగిస్తున్నారు. వాగ్మి బ్రాండ్ పేరిట దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందాలనే లక్ష్యంతో, మహిళా సంఘం సభ్యులు స్వయం ఉపాధి కోసం అగరుబత్తుల తయారీ పై దృష్టిసారించారు.

కాగా జిల్లాకు చెందిన మహిళలు వాగ్మీ మహిళా సంఘంగా ఏర్పడి అదే బ్రాండ్ పేరిట జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే గొంగిడి సునీత, యాదాద్రి దేవ స్థానం సహకారంతో అగరు బత్తుల తయారీకి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన ముడి సరకులు కొన్ని యాదాద్రి దేవస్థానం నుంచి అందుతున్నాయి. రానున్న రోజుల్లో వాగ్మి పేరిట కుంకుమ, పసుపు, కొబ్బరిచిప్పలతో ఆకృతులను తయారు చేస్తామని సంఘ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..