Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Twitter Blue Tick: బ్లూ టిక్‌పై ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం.. ఈనెల 29న తిరిగి ప్రారంభం

ట్విట్టర్‌ ఖాతాదారులకు బ్లూ టిక్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. బ్లూటిక్‌ను నిలిపివేయడంతో సంచలనంగా మారింది. ఇక తన యూజర్ల కోసం ట్విట్టర్‌ బ్లూటిక్‌ ప్లాన్‌ను..

Twitter Blue Tick: బ్లూ టిక్‌పై ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం.. ఈనెల 29న తిరిగి ప్రారంభం
Twitter Blue Tick
Follow us
Subhash Goud

|

Updated on: Nov 16, 2022 | 11:55 AM

ట్విట్టర్‌ ఖాతాదారులకు బ్లూ టిక్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. బ్లూటిక్‌ను నిలిపివేయడంతో సంచలనంగా మారింది. ఇక తన యూజర్ల కోసం ట్విట్టర్‌ బ్లూటిక్‌ ప్లాన్‌ను తిరిగి తీసుకువస్తున్నట్లు ట్విట్టర్‌ వెల్లడించింది. ఈనెల 29న బ్లూ టిక్‌ చందాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. టెస్లా అధినేత ఎలాన్‌ మాస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఈ బ్లూ టిక్‌ ఛార్జీలు పెంచడంతో వివాదంగా మారింది. అప్పటి నుంచి ఈ బ్లూ టిక్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. ట్విట్టర్‌ ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్ బ్యాడ్జి కోసం నెల నెలా 8 డాలర్లు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పాడు. అలా చెల్లించలేమని అనుకునే వాళ్లు నిరభ్యంతరంగా బ్లూ టిక్ ను వదులుకోవచ్చని కూడా ప్రకటించాడు. అమెరికాలోని చాలా నకిలీ ట్విట్టర్ ఖాతాలు $8 చెల్లించి బ్లూ టిక్‌ను పొందాయి. దీంతో ఇబ్బంది పడిన ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను బ్యాన్ చేసింది. అయితే దీన్ని మరోసారి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

సస్పెండ్ చేసిన ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 29 నుంచి పునఃప్రారంభించబడుతుందని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ తెలిపారు. ఇది రాక్ సాలిడ్ అని నిర్ధారించుకోవడానికి లాంచ్‌ను వాయిదా వేస్తున్నట్లు మస్క్ చెప్పారు. ఈ విషయాన్ని మస్క్ ట్వీట్ ద్వారా తెలియజేశాడు. నిజానికి ఎలోన్ మస్క్ త్వరలో బ్లూ టిక్ సబ్‌స్క్రైబర్ సర్వీస్‌ను ప్రారంభించడం గురించి మాట్లాడాడు. చాలా నకిలీ ట్విట్టర్ ఖాతాలు ఇంతకు ముందు $8 చెల్లించి బ్లూ టిక్‌ను పొందాయి. ఆ తర్వాత ఈ ఖాతాల నుండి నకిలీ ట్వీట్లు పోస్ట్ చేయబడ్డాయి. ఈ కారణంగా బ్లూ టిక్ సబ్‌స్క్రైబర్ సర్వీస్‌ను నిలిపివేయాలని ట్విట్టర్ ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఈ నకిలీ ఖాతాల నుండి నకిలీ ట్వీట్ల కారణంగా చాలా పెద్ద కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చింది. అమెరికన్ ఫార్మా కంపెనీ ఎలి లిల్లీ అండ్‌ కో ఇన్సులిన్ ఉచితం అంటూ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తర్వాత కంపెనీ ప్రజలకు క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. అంతే కాదు పెప్సీ అనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కోక్ బెటర్ అంటూ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్‌ని నిశితంగా పరిశీలించిన తర్వాత ఈ అకౌంట్ ఫేక్ అని తెలిసింది. ఎందుకంటే ఈ ఫేక్ అకౌంట్ ట్విట్టర్ హ్యాండిల్ పేరు PEPSICO అని కాకుండా PEPICO అని ఉంది.

అయితే ఎలోన్ మస్క్ ట్విటర్‌ను దక్కించుకున్న తర్వాత నాటినుండి అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముందుగా ఖర్చులను తగ్గించుకొనేందుకు ఉద్యోగులపై వేటు వేశారు. తొలుత సంస్థలో పనిచేస్తున్న సగం మంది ఉద్యోగులను తొలగించిన మస్క్.. తాజాగా సుమారు 4వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. ట్విటర్ సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా బ్లూటిక్ ను అందుబాటులోకి తెచ్చారు.

బ్లూటిక్ ను పొందిన అకౌంట్లో ఎక్కువ శాతం నకిలీ ఖాతాలు ఉండటంతో తాత్కాలికంగా బ్లూటిక్ సేవలను మస్క్ నిలిపివేశారు. అయితే ఈసారి మాత్రం బ్లూటిక్ ఇవ్వడంపై చాలా జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పహల్గామ్‌లో ఉగ్రదాడి.. పర్యాటకుల భద్రతపై సుప్రీంకోర్టులో పిల్‌!
పహల్గామ్‌లో ఉగ్రదాడి.. పర్యాటకుల భద్రతపై సుప్రీంకోర్టులో పిల్‌!
ఆ బ్యాగు వద్ద ఆగిన పోలీస్ డాగ్.. పోలీసులు ఓపెన్ చేయగా షాక్
ఆ బ్యాగు వద్ద ఆగిన పోలీస్ డాగ్.. పోలీసులు ఓపెన్ చేయగా షాక్
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..