US space ship:అమెరికా అంతరిక్ష డ్రోన్.. 908 రోజుల తర్వాత భూమిపైకొచ్చింది.. !వీడియో
అమెరికా ప్రయోగించిన ‘ఎక్స్-37బీ ఆర్బిటల్ టెస్ట్ వెహికల్’ 908 రోజుల తర్వాత ఫ్లోరిడాలో నాసాకు చెందిన కెన్నెడి స్పేస్ సెంటర్లో ల్యాండ్ అయింది. అమెరికాకు చెందిన స్పేస్ ఫోర్స్ రహస్య వాహనాన్ని 2020 మే నెలలో ప్రయోగించింది.
అమెరికా ప్రయోగించిన ‘ఎక్స్-37బీ ఆర్బిటల్ టెస్ట్ వెహికల్’ 908 రోజుల తర్వాత ఫ్లోరిడాలో నాసాకు చెందిన కెన్నెడి స్పేస్ సెంటర్లో ల్యాండ్ అయింది. అమెరికాకు చెందిన స్పేస్ ఫోర్స్ రహస్య వాహనాన్ని 2020 మే నెలలో ప్రయోగించింది. ఈ స్పేస్ వెహికల్‌ను బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసింది. గతంలో కక్ష్యలో గడిపిన 780 రోజుల రికార్డును ఈ సారి బద్దలు కొట్టినట్లు బోయింగ్ పేర్కొంది. ఈ యాత్రకు సంబంధించిన కీలక విషయాలను స్పేస్ ఫోర్స్ బయటపెట్టలేదు. ఈ సారి దీనిలో పేలోడ్ సంఖ్యను పెంచేలా సర్వీస్ మాడ్యూల్‌ను కూడా తీసుకెళ్లింది.అంతరిక్షంలో ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ నుంచి ఈ మాడ్యూల్ విడిపోయి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో అమెరికా నేవల్ రీసెర్చి పరిశోధనశాలకు అవసరమైన ప్రయోగాలు చేశారు. ఎక్స్-37బీకి ఆరో అంతరిక్ష యాత్ర. తన ప్రయాణంలో మొత్తం 1.3 బిలియన్ మైళ్ల దూరం ఇది ప్రయాణించింది. మొత్తం 3,774 రోజులు అంతరిక్షంలో గడిపింది. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలకు అవసరమైన పలు ప్రయోగాలను అంతరిక్షంలో నిర్వహించి వాటిని విశ్లేషణ నిమిత్తం తిరిగి భూమిపైకి సురక్షితంగా చేరుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

