International Men’s Day: మగమహారాజులకూ ఓ రోజు ఉంది.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..

మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, వాలెంటైన్స్ డే, విమెన్స్ డే.. ఇలా అందరికీ ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. కానీ కుటుంబపెద్దగా, బాధ్యతలు మోస్తూ.. సమస్యల సుడిగండంలో చిక్కుకుని, సంసార సాగరాన్ని..

International Men's Day: మగమహారాజులకూ ఓ రోజు ఉంది.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..
International Mens Day
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 19, 2022 | 12:16 PM

మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, వాలెంటైన్స్ డే, విమెన్స్ డే.. ఇలా అందరికీ ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. కానీ కుటుంబపెద్దగా, బాధ్యతలు మోస్తూ.. సమస్యల సుడిగండంలో చిక్కుకుని, సంసార సాగరాన్ని అతి కష్టం మీద లాక్కొచ్చే మగవాళ్లకు కూడా ఓ ప్రత్యేకమైన దినోత్సవం ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవడం బాధాకరం. స్త్రీ అమ్మగా ప్రాణం పోసి జీవమిస్తే.. పురుషుడు నాన్నగా ఆ ప్రాణానికి ఓ రూపునిచ్చి ఉన్నత వ్యక్తిని చేస్తాడు. ప్రతి విజయంలో వెనుకే ఉంటూ బాధలోనైనా నేనున్నాననే ఆసరా ఇస్తాడు. అలాంటి గొప్ప మనసు ఉన్న మగవాళ్ల గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకునేందుకు వారికంటూ ఓ రోజు ఉంది. అదే నవంబర్ 19. ఏటా ఈ తారీఖున అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకను కొన్ని దేశాల్లో మాత్రమే జరుపుకొంటున్నారు. సుమారు 70 దేశాలు ఏటా ఇంటర్నేషనల్ మెన్స్ డే నిర్వహిస్తున్నాయి. సమాజంలో ఆడ అయినా.. మగ అయినా అందరూ సమానమే. ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి. నేటి కాలంలో ఇద్దరూ కూడా సమానంగా పనిచేస్తు కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. కానీ.. కుటుంబ బాధ్యతలు మగ వాళ్లపైనే అధికంగా ఉంటాయనేది అంగీకరించాల్సిన వాస్తవం.

ఇంటిని ఆర్థికంగా చూసుకునే బాధ్యత వారిపై ఎక్కువగా ఉంటుంది. ఆడవారు ఇంటి పనులను చక్కబెడితే.. మగవారు ఇంటిని నడిపించే బాధ్యతలు చూసుకుంటారు. కాలం మారుతున్న కొద్దీ లింగ వివక్ష తగ్గుతోంది. స్త్రీ, పురుషులిద్దరూ సమానంగా కుటుంబాన్ని చూసుకుంటూ నడిపించుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి వారిని మరింత ప్రోత్సహించేందుకే ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రధాన లక్ష్యం. పురుషుడు.. తన జీవితంలో ఎన్నో రకాల పాత్రలు పోషిస్తాడు. అయితే మహిళలకు లభించినంత గుర్తింపు వీరికి దక్కడం లేదు. మహిళల కంటే బలమైనవారు అనే భావన ఉండటం వల్ల ప్రపంచంలో పురుషుల ఆధిపత్యమే నడుస్తుందని అనకుంటున్నారు.

తన జీవితంలో నాన్న, తమ్ముడు, అన్న, భర్త, కుమారుడు, ఇలా ఆడవారి జీవితంలో అనేక బంధాలతో మగవారు భాగమై ఉంటారు. వెలుగునిచ్చే సమిధలా కంటిని కాపాడే కనుపాపలా కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి ఆమోదంతో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 1999లో తొలిసారిగా ‘అంతర్జాతీయ పురుషుల దినోత్సవం’ జరిగింది. అప్పటి నుంచి నవంబర్ 19న ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇండియాతోపాటు ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, కరీబీయన్ దీవుల తో సహా 60 దేశాల్లో పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పురుషుల సమస్యలపై దృష్టి సారించడం, లింగ వివక్ష లేని సమాజాన్ని సాధించడమే ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం..

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..