Andhra Pradesh: వారికి సీఎం జగన్ గుడ్‌న్యూస్.. నేరుగా ఖాతాల్లో నగదు జమ చేసేందుకు డేట్ ఫిక్స్
అనర్హుల జాబితాలోని విద్యార్థులు వారి అర్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సచివాలయాల్లో సమర్పించాలని అధికారులు కోరుతున్నారు.
విద్య, వైద్యం విషయంలో ఏపీ సీఎం జగన్ ఫుల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఈ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఎన్నో కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ.. ఆయా పథకాల కోసం నిధుల విషయంలో రాజీ పడటం లేదు. తాజాగా విద్యా దీవెన డబ్బును అర్హుల ఖాతాల్లో విడుదల చేసేందుకు డేట్ పిక్స్ చేశారు. ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న పేద స్టూడెంట్స్ నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఈ స్కీమ్ కింద ఫీజు రీఇంబర్స్‌మెంట్ అందజేస్తుంది సర్కార్.
ఈ దఫాలో దాదాపు 10.85 లక్షల మంది విద్యార్ధులకు రూ. 709 కోట్లను సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ నెల 25న మదనపల్లెలో ఈ కార్యక్రమం జరగనుంది. జగనన్న విద్యా దీవెన కింద డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఐటీఐ, పాలిటెక్నిక్ తదితర కోర్సులు చదివే పూర్ స్టూడెంట్స్ కళాశాలలకు కట్టాల్సిన ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా 3 నెలలకు ఒకసారి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జగన్ సర్కార్ నేరుగా జమ చేస్తోంది.
తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా… వారు ప్రతీ 3 నెలలకోసారి కళాశాలలకు నేరుగా వెళ్లి ఫీజులు చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు, కాలేజీలలో వసతులు పరిశీలించి లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారని సర్కార్ భావిస్తోంది. ఇలా చేయడంతో కాలేజీలలో జవాబుదారీతనం పెరుగుతుందని, అక్కడి స్ధితిగతులతో పాటు పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ గతంలో చెప్పుకొచ్చారు.