AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అన్ని అంగన్‌వాడీలల్లో ఫ్లేవర్డ్‌ మిల్క్‌ సరఫరా.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

గురుకుల హాస్టల్స్‌కి వెళ్తే..విద్యార్థులకు జైల్లోకి వెళ్లామా అనే భావం రాకూడదన్నారు ఏపీ సీఎం జగన్‌. ఇంతకీ ముఖ్యమంత్రి ఈ మాటలు ఎందుకన్నారు..?

Andhra Pradesh: అన్ని అంగన్‌వాడీలల్లో ఫ్లేవర్డ్‌ మిల్క్‌ సరఫరా.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 18, 2022 | 8:19 PM

ఏపీలో సంక్షేమ హాస్టళ్లు, మహిళా,శిశు సంక్షేమశాఖపై ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు. 3,364 కోట్ల రూపాయలతో హాస్టళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా హాస్టళ్ల కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.

రానున్న మూడు నెల్లలోగా అన్నీ అంగన్‌వాడీలల్లో ఫ్లేవర్డ్‌ మిల్క్‌ను సరఫరా చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీలలో టాయి లెట్ల నిర్వహణ, పరిశుభద్రతకు పెద్దపీట వేయాలన్నారు. ఇక గురుకుల పాఠశాలలో మూడు దశల్లో నాడు-నేడు కార్యక్రమం నిర్వాహించాలన్నారు. పిల్లలు హాస్టళ్లకి వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం ఉండకూడదన్నారు. హాస్టళ్లలో ఉంచాల్సిన బంకర్‌ బెడ్స్‌.. ఇతర సౌకర్యాలన్నీ నాణ్యతతో ఉండాలని సూచించారు సీఎం జగన్‌. సమాజంలోని పేదవారు తాము చదువుకోవడానికి తగిన పరిస్థితులు లేవన్న భావన ఉండకూడదన్నారు.

గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తం 3013 చోట్ల నాడు–నేడు పనులు చేపట్టాలని సూచించారు సీఎం జగన్‌. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ కూడా ఫస్ట్ ఫేజ్‌లో బాగుచేయాలని జగన్ ఆదేశించారు. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్‌ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. ఇక ట్రైబల్‌ వెల్ఫేర్ గురుకులాల్లో 171 మంది హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..