AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: కర్నూల్ టూర్ లో చంద్రబాబుకి నిరసన సెగ.. న్యాయ రాజధానికి మద్దతు పలకాలని లాయర్ల డిమాండ్

కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో న్యాయవాదులు కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 

Chandrababu: కర్నూల్ టూర్ లో చంద్రబాబుకి నిరసన సెగ.. న్యాయ రాజధానికి మద్దతు పలకాలని లాయర్ల డిమాండ్
Chandrababu Kurnool Tour
Surya Kala
|

Updated on: Nov 18, 2022 | 5:20 PM

Share

కర్నూలు లో న్యాయవాదులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య వివాదం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్న రాయలసీమ యువజన విద్యార్థి జేఏసీ. కర్నూలు న్యాయ రాజధానికి చంద్రబాబు మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. అంతేకాదు నగరం అంతా రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూఫ్లెక్సీలు వెలిశాయి.

కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో న్యాయవాదులు కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.  అక్కడే ఉన్న కర్నూలు టిడిపి నేతలు వారిని అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ కార్యకర్తలు సీఎం జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రొటెస్ట్ చేస్తోన్న లాయర్లను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. చంద్రబాబు నగరం లో వెళ్తుండగా హాస్పిటల్ ఎదురుగా కాన్వాయ్ ను విద్యార్థి jac అడ్డుకుంది. పోలీసులువిద్యార్థులను ఈడ్చి పక్కకు పంపించారు. బాబు గో బ్యాక్ అంటూ స్టూడెంట్స్ నినాదాలు చేశారు. అయితే ఈ సంఘటనలపై చంద్రబాబు మండిపడ్డారు. ఇదంత పోలీసుల వైఫల్యం అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

Reporter: Nagi Reddy, Tv9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..