Elon Musk: ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాపై నిషేధం ఎత్తేయాలా.. వద్దా? నెటిజన్లను కోరిన ఎలన్ మస్క్.. ప్రజల అభిప్రాయం ఏమిటో తెలుసా..

"మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా " అని ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ తన పేజీలో ఓ పోస్ట్ చేశారు. అంతేకాదు దీనికి అవును లేదా కాదు అని ఓటు వేసే అవకాశాన్ని ట్విట్టర్ ఖాతాదారులకు ఇచ్చారు.

Elon Musk: ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాపై నిషేధం ఎత్తేయాలా.. వద్దా? నెటిజన్లను కోరిన ఎలన్ మస్క్.. ప్రజల అభిప్రాయం ఏమిటో తెలుసా..
Elon Musk Vs Trump
Follow us

|

Updated on: Nov 19, 2022 | 4:43 PM

ఎలన్ మస్క్ ప్రముఖ సోషల్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత పలు సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నాడు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై  ఉన్న ట్విట్టర్ నిషేధాన్ని ఎత్తివేయాలా వద్దా అనే దాని అనే విషయంపై స్పందించాడు. తాను ఇంకా డోనాల్డ్ ట్విట్టర్ ఖాతా విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే ఇలా  చెప్పిన కొద్ది గంటల తర్వాత..  సోషల్ నెట్‌వర్క్ కొత్త యజమాని ఎలన్ మస్క్.. సంచలన నిర్ణయం ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ను ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌కి తిరిగి అనుమతినివ్వాలా వద్దా అనే విషయంపై వినియోగదారులు ఓటు వేసి తమ అభిప్రాయాన్ని తెలిపాలని కోరారు. “మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా ” అని ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ తన పేజీలో ఓ పోస్ట్ చేశారు. అంతేకాదు దీనికి అవును లేదా కాదు అని ఓటు వేసే అవకాశాన్ని ట్విట్టర్ ఖాతాదారులకు ఇచ్చారు.  ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతాపై నిషేధం ఎత్తేయాలా.. వద్దా? అంటూ.. జనాభిప్రాయం అడిగారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో శుక్రవారం సాయంత్రం ఓ పోల్‌ నిర్వహించారు. మొత్తంగా 24 గంటల పాటు కొనసాగే ఈ అభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ పోస్టుకు నెటిజన్లు భారీ సంఖ్యలో స్పందిస్తున్నారు. ఇప్పటికే రెండు మిలియన్ల మంది ప్రతిస్పందించారు. దాదాపు 59.6 శాతం మాజీ అధ్యక్షుడు ట్రంప్ ట్విటర్ ఖాతాలోకి  తిరిగి రావడానికి అనుకూలంగా ఉన్నారు.

2021లో క్యాపిటల్‌ హిల్‌పై దాడి సందర్భంగా ట్రంప్‌ ఖాతాపై ట్విటర్‌ శాశ్వత నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇటీవల ట్విటర్‌ను కొనుగోలు ఎలాన్‌ మస్క్‌లో ఇప్పటికే 20 లక్షల మంది పాల్గొన్నారు. అందులో దాదాపు సగం మంది ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించేందుకు అనుకూలంగా ఓట్లేసినట్లు తెలుస్తోంది.

2021లో యుఎస్ క్యాపిటల్‌ హిల్‌పై దాడి సందర్భంగా ట్రంప్‌ ఖాతాపై ట్విటర్‌ శాశ్వత నిషేధం విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలను అప్పటి ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఇదే విషయంపై ట్రంప్ స్పందిస్తూ.. తాను జనాదరణ పొందిన ప్లాట్‌ఫారమ్‌కి తిరిగి రాలేనని..  ట్విట్టర్ నిషేధించిన అనంతరం ప్రారంభించిన తన సొంత నెట్‌వర్క్ ట్రూత్ సోషల్‌లోనే ఉంటానని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్‌ను 88 మిలియన్లకు పైగా వినియోగదారులు అనుసరిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..