AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japanese Snack: మీరు ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్తే.. 30 ఏళ్ల లోపు డెలివరీ చేసేస్తారట.. ఆ డిష్ కు అంత డిమాండ్ మరి..

నిజమండి బాబు.. ఇప్పడు ఆర్డర్‌ చేస్తే అది మీకు డెలివరీ కావడానికి ఏకంగా 30 ఏళ్లు పడుతుందట. అంటే ఈ ఏడాది ఈ డిష్ ను ఆర్డర్ చేస్తే 2052 లో డెలివరీ ఇస్తారట. మరి ఆ స్పెషల్ వంటకం గురించి వివరాల్లోకి వెళ్దాం..

Japanese Snack: మీరు ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్తే.. 30 ఏళ్ల లోపు డెలివరీ చేసేస్తారట.. ఆ డిష్ కు అంత డిమాండ్ మరి..
Popular Japanese Beef Croquette
Surya Kala
|

Updated on: Nov 19, 2022 | 6:22 PM

Share

సాధారణంగా బాగా ఆకలి వేస్తున్నప్పుడు, ఇంటికి వెళ్లి వంటచేసేంత తీరిక, ఓపిక లేనప్పుడు వెంటనే ఫుడ్‌ ఆర్డర్‌ చేసేస్తాం. అంతే క్షణాల్లో మనముందు వేడి వేడి ఫుడ్‌ రెడీగా ఉంటుంది. ఎంచక్కా ఆరగించేస్తాం. కానీ కొన్ని ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయి. వాటిని మీరు రుచి చూడాలంటే కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. ఎంత ప్రత్యేకమైన వంటకాలైనా మహా ఓ రెండు మూడు రోజులు పడుతుంది. కానీ జపాన్‌కు చెందిన ఓ ప్రత్యేక వంటకం తినాలంటే మాత్రం సుమారు 30 ఏళ్లు వెయిట్‌ చెయ్యాలసిందే అట. నమ్మటం లేదా.. నిజమండి బాబు.. ఇప్పడు ఆర్డర్‌ చేస్తే అది మీకు డెలివరీ కావడానికి ఏకంగా 30 ఏళ్లు పడుతుందట. అంటే ఈ ఏడాది ఈ డిష్ ను ఆర్డర్ చేస్తే 2052 లో డెలివరీ ఇస్తారట. మరి ఆ స్పెషల్ వంటకం గురించి వివరాల్లోకి వెళ్దాం..

జపాన్ లో మాత్రమే తయారు చేసే ఈ ప్రత్యేక వంటకం పేరు క్రోక్విట్స్. చూడడానికి ఇవి ఆలూ కట్లెట్‌లా కనిపిస్తాయి. ఇది చాలా పాత వంటకం అట. గత 96 ఏళ్లుగా జపాన్ లో ‘ఆషియా’ అనే ఫ్యామిలీ మాత్రమే ఈ వంటకాన్ని తయారుచేస్తోందట. ఇప్పుడు ఈ వంటకాన్ని ఆషియా ఫ్యామిలీలోని మూడవతరానికి చెందిన షిగేరు నిట్టా అనే వ్యక్తి తయారు చేస్తున్నాడట. దీని తయారీకి స్థానికంగా పండించే బంగాళాదుంపలు, జపాన్ కు చెందిన కోబ్‌ అనే నల్లజాతి పశువుల గొడ్డు మాంసాన్ని ఉపయోగిస్తారట. అయితే ఈ పశువుల్లో 3 సంవత్సరాల వయసున్న పశువుల మాంసాన్ని మాత్రమే వినియోగిస్తారట. కాగా వీటిని వారంలో కేవలం రెండువందలు మాత్రమే తయారు చేస్తారట. అందుకే వీటిని ఎక్కువగా పంపిణీ చేయలేకపోతున్నారు.

1996 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ క్రోక్విట్స్ ను అమ్మడానికి ఆన్లైన్ స్టోర్ ను ఓపెన్ చేశారు. అప్పటి నుండి వీటిని ఆర్డర్ చేసుకోవడం మొదలు పెట్టారు చాలామంది. అయితే వీటిని ఆర్డర్‌ చేసిన 30 ఏళ్ల లోపు ఎప్పుడైనా డెలివరీ అవుతుంది. అన్ని సంవత్సరాల తరువాత నిజంగానే డెలివరీ ఇస్తారా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. అయితే 2013 సంవత్సరంలో ఓ మహిళ ఈ డిష్ ను ఆర్డర్ చేయగా తాజాగా ఆమెకు డెలివరీ ఇచ్చినట్టు పేర్కొంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇంతకీ దీని ధర ఎంతో చెప్పలేదు కదూ… దీని ధర 1600 రుపాయలు. ఇందులో అయిదు కట్లెట్ లాంటి పీస్ లు ఉంటాయి. 2000 సంవత్సరంలో ఈ క్రోక్విట్స్ గురించి ఓ న్యూస్ పేపర్ ప్రచురించడంతో ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం