Nikhil Siddhartha: హీరో నిఖిల్‌పై పుకార్లు షికార్లు.. ఒక్క ఫొటోతో ఫుల్‌స్టాప్‌ పెట్టేశాడుగా..

త కొద్ది కాలంగా నిఖిల్‌కు సంబంధించి ఒక వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిఖిల్, ఆయన భార్య పల్లవి వర్మ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట్లో జోరుగా పుకార్లు షికారు చేశాయి. తాజాగా ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టాడు నిఖిల్‌.

Nikhil Siddhartha: హీరో నిఖిల్‌పై పుకార్లు షికార్లు.. ఒక్క ఫొటోతో ఫుల్‌స్టాప్‌ పెట్టేశాడుగా..
Nikhil Siddhartha
Follow us
Basha Shek

|

Updated on: Nov 19, 2022 | 6:15 AM

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ2 సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమాతో పాన్‌ ఇండియా హీరో ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. గత కొద్ది కాలంగా నిఖిల్‌కు సంబంధించి ఒక వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిఖిల్, ఆయన భార్య పల్లవి వర్మ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట్లో జోరుగా పుకార్లు షికారు చేశాయి. తాజాగా ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టాడు నిఖిల్‌. 2020లో భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్‌ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తన భార్య పల్లవితో గోవాలో వెకేషన్‌లో ఉన్నాడు.

గోవా టూర్‌లో తన భార్యతో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘మనిద్దరం కలిసున్న ప్రతిక్షణం అద్భుతమే’ అని రాసుకొచ్చాడు. దీంతో తమపై వస్తోన్న విడాకుల రూమర్లకు నిఖిల్‌ చెక్‌ పెట్టినట్లైంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం 18 పేజెస్ సినిమాతో బిజీగా ఉన్నాడు నిఖిల్‌. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. డిసెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ అందించడం విశేషం. గతంలో కరెంట్, కుమారి 21ఎఫ్ చిత్రాలతో ఆకట్టుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..