AUS vs ENG: స్టార్క్ సూపర్ ఇన్‌స్వింగర్.. దెబ్బకు వికెట్లు ఢమాల్.. మాడిపోయిన రాయ్ ముఖం
సులువుగా సిక్సర్లు, ఫోర్లు కొట్టే జాసన్ రాయ్ కొత్త బంతిని కాచుకోలేక క్రీజులో ఆపసోపాలు పడ్డాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఆసీస్ స్టార్ బౌలర్ స్టార్క్ వేసిన ఓ ఇన్‌స్వింగ్‌ర్ జాసన్ రాయ్ వికెట్లను గిరాటేసింది.
క్రికెట్‌లో కొత్త బంతిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. అది వన్డేల్లో అయినా.. టెస్ట్ క్రికెట్‌లో అయినా. బౌలర్ సరైన లెంగ్త్ అండ్ లైన్‌లో బంతిని విసిరితే బ్యాటర్ వద్ద ఎలాంటి సమాధానం ఉండదు. గురువారం ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డేలోఇదే జరిగింది. సులువుగా సిక్సర్లు, ఫోర్లు కొట్టే జాసన్ రాయ్ కొత్త బంతిని కాచుకోలేక క్రీజులో ఆపసోపాలు పడ్డాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఆసీస్ స్టార్ బౌలర్ స్టార్క్ వేసిన ఓ ఇన్‌స్వింగ్‌ర్ జాసన్ రాయ్ వికెట్లను గిరాటేసింది. ఐదో ఓవర్‌లో స్టార్క్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని డ్రైవ్ చేయడానికి రాయ్ ప్రయత్నించగా చివరి క్షణంలో బంతి ఇన్ స్వింగ్ అయింది. దీంతో రాయ్ ఏమీ చేయలేకపోయాడు. దెబ్బకు మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. కాగా ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీ20 ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ కుదేలైంది. ఈ జట్టు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జేమ్స్ విన్స్, సామ్ బిల్లింగ్స్, జాసన్ రాయ్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.రాయ్ 6, సాల్ట్ 14 పరుగులు చేశారు. విన్స్ 5 పరుగులు చేసి కమిన్స్‌కు బలయ్యాడు. అదే సమయంలో సామ్ బిల్లింగ్స్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోయినిస్‌కి వికెట్ ఇచ్చాడు. ఈ వికెట్లన్నింటిలో స్టార్క్ వికెట్ చాలా ప్రత్యేకమైనది. అందుకే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 రన్స్ చేసింది. మలన్ వన్డేల్లో రెండవ సెంచరీ నమోదు చేశాడు. అతను 128 బంతుల్లో అతను 134 రన్స్ చేశాడు. బట్లర్ 29, విల్లే 34 రన్స్ చేశారు. కమ్మిన్స్, జంపాలు మూడేసి వికెట్లు తీసుకున్నాడు. ఇక 288 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఆసీస్ ఓపెనర్లు వార్నర్, హెడ్‌లు తొలి వికెట్‌కు 147 పరుగుల మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వార్నర్ 86, హెడ్ 69 రన్స్ చేశారు. ఇక వన్ డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలి వన్డే గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని నమోదు చేసింది.
STARC!
A trademark inswinger from the big quick! #AUSvENG#PlayOfTheDay | #Dettol pic.twitter.com/94zYtKeNOE
— cricket.com.au (@cricketcomau) November 17, 2022
Steve Smith at his best is magic to watch ✨#AUSvENG
— cricket.com.au (@cricketcomau) November 17, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..