Afridi: టీ-20 కెప్టెన్సీ ని వదులుకుంటే మంచిది.. బాబర్ ఆజమ్ కు మాజీ క్రికెటర్ ఆఫ్రిది సూచన..
ఐసీసీ టీ-20 వరల్ కప్ లో పాకిస్తాన్ పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించి కప్పు ఎగరేసుకు పోయిన విషయం తెలిసిందే. టోర్నీని ఓటమితో ప్రారంభించి, ఫైనల్ వరకు చేరిన పాకిస్తాన్ తుదిపోరులో బొక్కబోర్లాపడింది...
ఐసీసీ టీ-20 వరల్ కప్ లో పాకిస్తాన్ పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించి కప్పు ఎగరేసుకు పోయిన విషయం తెలిసిందే. టోర్నీని ఓటమితో ప్రారంభించి, ఫైనల్ వరకు చేరిన పాకిస్తాన్ తుదిపోరులో బొక్కబోర్లాపడింది. అటు బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ రాణించకుండా చేతులెత్తేసింది. దీంతో కప్పు గెలవాలనుకున్న పాక్ ఆశలు నీరుగారిపోయాయి. అయితే.. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం అంతగా రాణించలేకపోయాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన బాబర్ కేవలం 124 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో బాబర్ కెప్టెన్సీపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు చేశారు. అతను కెప్టెన్‌గా పనికిరాడని, తప్పుకోవాలని ఘాటు వ్యా్ఖ్యలు చేశారు. తాజాగా బాబర్‌ను ఉద్దేశించి పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టీ-20 కెప్టెన్సీని వదులుకుని వన్డేలు, టెస్టుల్లో జట్టును నడిపించడంపై దృష్టి సారించాలని సజెషన్ ఇచ్చారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ అతను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకూడదని అభిప్రాయపడ్డాడు.
బాబర్ ఆజంను తాను చాలా గౌరవిస్తానన్న ఆఫ్రిది.. అందుకే టీ – 20 క్రికెట్‌లో కెప్టెన్సీ ఒత్తిడిని తీసుకోకూడదని తాను కోరుకుంటున్నట్లు అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుని వన్డే, టెస్టు ఫార్మాట్‌లపై దృష్టిపెట్టాలన్నారు. షాదాబ్, రిజ్వాన్, షాన్ మసూద్ వంటి ఆటగాళ్లకి టీ – 20 ఫార్మాట్‌లో జట్టును నడిపించే సత్తా ఉందన్న ఆఫ్రిది.. పీఎస్ఎల్ లోనూ బాబర్ సారథ్య బాధ్యతలు చేపట్టకూడదని అభిప్రాయపడ్డాడు.
కాగా.. టీ 20 వరల్డ్ కప్ – 2022 ట్రోఫీ విజేతగా ఇంగ్లండ్ జట్టు అవతరించింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ లో పాకిస్తాన్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. మొయిన్ ఆలీ 19 పరుగులు చేశాడు. బెన్‌స్టోక్స్ విన్నింగ్ షాట్ కొట్టడంతో ఇంగ్లండ్ డగౌట్‌లో సంబరాలు మొదలయ్యాయి. ఫైనల్ లో గెలవడంతో రెండోసారి టీ 20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డు సృష్టించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..