IND Vs AUS: టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు కీలక సిరీస్.. భారత్, అసీస్ తొలి టెస్ట్ హైదరాబాద్‌లోనేనా.?
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది..
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. కాగా, రెండో టెస్ట్‌కు ఢిల్లీ, మూడో మ్యాచ్‌కు ధర్మశాల, ఆఖరి టెస్ట్‌కు అహ్మదాబాద్‌లను దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉంది. తుది షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్యలో బోర్డర్ – గవాస్కర్ సిరీస్ కోసం భారత్‌కు ఆసీస్ రానుంది. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగు టెస్టులు జరుగుతాయి. అందులో ఓ మ్యాచ్‌కు ఢిల్లీ వేదికగా నిలవడం ఖాయమని సమాచారం.
చివరగా అయిదేళ్ల క్రితం 2017 డిసెంబర్ నెలలో హైదరాబాద్‌లో శ్రీలంకతో టీమిండియా టెస్టు ఆడింది. రొటేషన్ పద్ధతి ప్రకారం ఢిల్లీలో ఈసారి కచ్చితంగా ఓ మ్యాచ్ జరగొచ్చు. మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణ కోసం అహ్మదాబాద్, ధర్మశాల, నాగ్‌పూర్, చెన్నై, హైదరాబాద్ రేసులో ఉన్నాయి. త్వరలోనే తేదీలు, వేదికలపై నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చివరి టెస్టు అహ్మదాబాద్‌లో జరిగొచ్చు. తొలి టెస్టు కోసం నాగ్‌పూర్, చెన్నై లేదా హైదరాబాద్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నాలుగు టెస్టుల్లో దేన్ని డేనైట్ మ్యాచ్‌గా నిర్వహిస్తారన్నది కూడా తేల్చాల్సి ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో చోటు దక్కించుకోవాలంటే ఈ సిరీస్‌ను భారత్ 4-0తో క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉంటుంది.