Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Superstar Krishna: అప్పుడు ప్రభాస్‌..ఇప్పుడు మహేశ్‌.. పుట్టెడు దుఃఖంలోనూ పెద్ద మనసు చాటుకున్న సూపర్‌స్టార్‌

పుట్టెడు దుఃఖంలోనూ మహేశ్ బాబు తన పెద్ద మనసును చాటుకున్నారు. తన తండ్రిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. వారందరికీ దగ్గరుండి భోజన ఏర్పాట్లు చేశారు.

Superstar Krishna: అప్పుడు ప్రభాస్‌..ఇప్పుడు మహేశ్‌.. పుట్టెడు దుఃఖంలోనూ పెద్ద మనసు చాటుకున్న సూపర్‌స్టార్‌
Mahesh Babu
Follow us
Basha Shek

|

Updated on: Nov 17, 2022 | 6:12 AM

సూపర్‌స్టార్‌ కృష్ణ మరణంతో టాలీవుడ్‌ తల్లిడిల్లిపోయింది. ఆయనను కడసారి చూసేందుకు పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు మహేశ్ ఇంటికి పోటెత్తారు. ఇక తమ అభిమాన నటుడిని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి సైతం వేలసంఖ్యలో ఫ్యాన్స్‌ నగరానికి చేరుకున్నారు. కృష్ణ పార్థివదేహాన్ని ఆఖరిసారి చూసి భావోద్వేగానికి లోనయ్యారు. కాగా అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పద్మాలయ స్టూడియో దారులు కిక్కిరిసపోయాయి. అనంతరం కుటుంబ సభ్యులు, అశేష అభిమాన జనవాహిని అశ్రు నయనాల మధ్య నటశేఖరుడి అంతిమ యాత్ర సాగింది. మధ్యాహ్నాం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. అయితే పుట్టెడు దుఃఖంలోనూ మహేశ్ బాబు తన పెద్ద మనసును చాటుకున్నారు. తన తండ్రిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. వారందరికీ దగ్గరుండి భోజన ఏర్పాట్లు చేశారు. అభిమానులు ఖాళీ కడుపుతో ఉండకూడదని తలంచిన మహేశ్‌బాబు అందరికీ భోజనం ఏర్పాట్లు చేయడంతో ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు మహేశ్‌ విషాదంలో ఉన్నా మా ఆకలి తీర్చారంటూ కొన్ని ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు ఫ్యాన్స్‌. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

కాగా కొన్ని రోజుల క్రితం కృష్ణంరాజు కూడా స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. ఆయనకు తుది వీడ్కోలు పలకడానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా తన పెద్దనాన్నను కడసారి చూడడానికి వచ్చిన అభిమానుల కోసం ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశాడు ప్రభాస్. ఆతర్వాత మొగల్తూరులో నిర్వహించిన కృష్ణంరాజు సంస్మరణ సభలో భారీ ఖర్చుతో భోజనాలు ఏర్పాటుచేశారు. ఇక కృష్ణ అంతిమయాత్రలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. మహేశ్‌ తన తండ్రి చితికి నిప్పంటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..