AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: మరోసారి సోషల్ మీడియాలో సమంత ఎమోషనల్ పోస్ట్.. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ..

డైరెక్టర్స్ హరి, హరీష్ దర్శకత్వంలో నిర్మాత శివలెంక ప్రసాద్ నిర్మించిన ఈమూవీ పాన్ ఇండియా లెవల్లో దాదాపు ఐదు భాషల్లో విడుదల చేశారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ మూవీ భారీగానే కలెక్షన్స్ వస్తున్నాయి. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. ఇప్పటివరకు రూ. 20 కోట్లు

Samantha: మరోసారి సోషల్ మీడియాలో సమంత ఎమోషనల్ పోస్ట్.. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ..
Samantha
Rajitha Chanti
|

Updated on: Nov 19, 2022 | 6:37 AM

Share

హీరోయిన్ సమంత టైటిల్ రోల్‏ పోషించిన చిత్రం యశోద. నవంబర్ 11న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‏తో సక్సెస్ ఫుల్‏ గా రన్ అవుతుంది. డైరెక్టర్స్ హరి, హరీష్ దర్శకత్వంలో నిర్మాత శివలెంక ప్రసాద్ నిర్మించిన ఈమూవీ పాన్ ఇండియా లెవల్లో దాదాపు ఐదు భాషల్లో విడుదల చేశారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ మూవీ భారీగానే కలెక్షన్స్ వస్తున్నాయి. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. ఇప్పటివరకు రూ. 20 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వీకెండ్‏లో యశోద కలెక్షన్స్ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యశోద చిత్రాన్ని హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు సామ్. ప్రస్తుతం తాను ఈ సినిమా సక్సె్స్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

” యశోద సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీరు ఇస్తున్న మద్దతు నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకు చాలా సంతోషాన్నిస్తుంది. థియేటర్లలో మీ సంబరాలు చూశాను.. మీరు చెప్పిన మాటలు విన్నాను. ఈ విజయం వెనక బృందం అహర్నిశలు నిర్విరామంగా కష్టపడ్డారు. ఇప్పుడు సంతోషంతో గాల్లో తేలునట్టుగా ఉంది. యశోద మీ ముందుకు రావడానికి కారణమైనవాళ్లకు.. ప్రాజెక్ట్ కోసం పనిచేసిన వాళ్లకు కృతజ్ఞతలు. హరి, హరిష్ దర్శకులతో పనిచేయడం నాకు ఎంతో సంతోషాన్ని్స్తుంది. ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారు. నా ప్రియమైన సహనటులు అందరితో కలిసి పనిచేయడం నాకు ఆనందాన్నిచ్చింది. మీకెప్పటికీ రుణపడి ఉండే మీ సమంత” అంటూ స్పెషల్ నోట్ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

సరోగసి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సమంత గర్భవతిగా కనిపించింది. ఇందులో ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ శర్మ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.