Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ ఇల్లు ఎంత అందంగా ఉందో చూశారా ?.. పూజా హెగ్డే హోమ్ భూవిపై ఇంద్రభవనమే.. చూపు తిప్పుకోలేరు..

ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండే పూజా.. పలు వాణిజ్య ప్రకటనలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‏తో అలంకరించిన తన ఇంటిని వివరిస్తూ ఓ వీడియోలో వివరించింది.

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ ఇల్లు ఎంత అందంగా ఉందో చూశారా ?.. పూజా హెగ్డే హోమ్ భూవిపై ఇంద్రభవనమే.. చూపు తిప్పుకోలేరు..
Pooja Hegde
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 17, 2022 | 8:40 AM

దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను దొచుకున్న అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు.. తమిళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. అగ్ర హీరోల సరసన స్క్రీన్ షేర్ చేసుకుని.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండిపోయింది. ఇటీవల రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పూజా… వరుస డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.. అయినా ఇండస్ట్రీలో మా త్రం ఈ అమ్మడు క్రేజ్ తగ్గట్లేదు. పూజా హెగ్డేకు దక్షిణాదిలో మాత్రం ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో పూరీ, విజయ్ కాంబోలో రాబోతున్న జనగణమన ప్రాజెక్ట్ ఉండగా.. మరోవైపు మహేష్.. త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలోనూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు షూటింగ్స్ తాత్కాలికంగా వాయిదా పడడంతో పూజా ఫుల్ రెస్ట్ తీసుకుంటుంది. తాజాగా మొదటి సారి తన ఇంటిని అభిమానుల ముందుకు తీసుకువచ్చింది.

ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండే పూజా.. పలు వాణిజ్య ప్రకటనలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‏తో అలంకరించిన తన ఇంటిని వివరిస్తూ ఓ వీడియోలో వివరించింది. అత్యంత ఖరీధైన ఇంటి నిర్మాణాన్ని ఓ రీల్ వీడియోతో ఫ్యాన్స్ కు వివరిస్తూ.. ఆమె ఇంటిని పరిచయం చేసింది. ఏషియన్ పెయింట్స్ వేర్ ది హార్ట్ ఈజ్ సిరీస్ వీడియోలలో భాగంగా పూజా తన ఇంటిని ట్రైలర్ రూపంలో చూపించింది. తన ఇంటి డిజైన్ వివరిస్తూ.. నా పేరేంట్స్ ఉద్యోగం చేస్తున్నారు. మా నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి తీరిగి వచ్చి పని ఒత్తిడిని ఎప్పుడూ తీసుకురాలేదు. ఆయన ఒక చిన్నపిల్లాడిలా మాతో ఆటలు ఆడేవారు. అందుకు ప్రధాన కారణం.. మా ఇంటి వాతావరణమే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బుట్టబొమ్మకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇటీవల కాలుకు గాయం కావడంతో పూజా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. మరోవైపు ఆమె చేయాల్సిన సినిమాల షూటింగ్స్ తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. త్వరలోనే పూజా తన సినిమా చిత్రీకరణలతో బిజీ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?