Krishna: కృష్ణ మనసు దొచుకున్న ఆ టెలివిజన్ షో.. ఎప్పటికైనా తాను చేయాలనుకున్నారు.. కానీ..

సూపర్ స్టార్ కృష్ణ అంటే.. చెప్పుకోడానికి చాలా పాత్రలే గుర్తుకు వస్తాయి. వాటిలో అల్లూరి సీతారామరాజు అత్యంత ముఖ్యమైనది. అయితే కృష్ణకు సీతారామరాజు తర్వాత ఆ రేంజ్ లో చేయాలనుకున్న పాత్ర ఛత్రపతి శివాజీ.

Krishna: కృష్ణ మనసు దొచుకున్న ఆ టెలివిజన్ షో.. ఎప్పటికైనా తాను చేయాలనుకున్నారు.. కానీ..
Super Star Krishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 16, 2022 | 8:41 AM

కృష్ణ.. అంటే ద కంప్లీట్ మేన్. ఇటు పర్సనల్ గా మాత్రమే కాదు అటు ప్రొఫెషనల్ ఆయన ఫుల్లీ శాటిస్టైడ్ పర్సన్. ఇక తెరపై ఆయన చేయని ప్రయోగాలు లేవు. పోషించని పాత్రల్లేవు. కానీ ఆయనకూ తీరని కోరికలున్నాయి.. చేయాలనుకున్న కేరెక్టర్లున్నాయి. తన అద్భుతమైన నటనతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న కృష్ణ మనసులో చాలానే కోరికలున్నాయి. ఇప్పటివరకు 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ.. అనేక ప్రయోగాలు.. సాహాసాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. తన కుమారులు రమేష్ బాబు.. మహేష్ బాబుతో కలిసి నటించిన కృష్ణ తన మనవడు గౌతమ్ ‏తో కలిసి నటించాలనుకున్నారట. కానీ ఆ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అలాగే మరిన్ని ఆయన మనసులో మరిన్ని తీరని కోరికలున్నాయి.

సూపర్ స్టార్ కృష్ణ అంటే.. చెప్పుకోడానికి చాలా పాత్రలే గుర్తుకు వస్తాయి. వాటిలో అల్లూరి సీతారామరాజు అత్యంత ముఖ్యమైనది. అయితే కృష్ణకు సీతారామరాజు తర్వాత ఆ రేంజ్ లో చేయాలనుకున్న పాత్ర ఛత్రపతి శివాజీ. సీతారామరాజు సమయంలోనే.. శివాజీ స్క్రిప్ట్ కొంత మేర వర్క్ చేయించారు. అయితే ఈ కథలో ఎన్నో సున్నితాంశాలున్నాయనీ. దీనికీ సీతారామరాజుకూ చాలానే తేడాలున్నాయని.. ఛత్రపతిని ఉన్నది ఉన్నట్టు తెరకెక్కిస్తే.. మతఘర్షణలు చెలరేగే ప్రమాదముందని గ్రహించిన కృష్ణ. దాన్ని పక్కన పెట్టేశారు. ఒక పక్క కేరెక్టర్ చేయాలన్న కోరిక తనలో ఉన్నా.. పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి.. చేయలేక పోయారు. ఇక తెలుగు తెరకు జేమ్స్ బాండ్ పరిచయం చేసిందే సూపర్ స్టార్ కృష్ణ. ఇదే కేరెక్టర్ తనయుడు మహేష్ బాబు వేస్తే చూడాలనుకున్నారు. ఈ మాట చాలా సమయాల్లో ఆయన అన్నారు కూడా. కానీ ఆయన బతికుండగా ఎందుకనో అది కుదరలేదు. ఇక కృష్ణ తన కొడుకులు రమేష్, మహేష్ ఇద్దరితోనూ కలసి నటించారు.

మనవడు గౌతమ్ తోనూ ఒక సినిమా చేయాలనుకున్నారు. కానీ అది కూడా వీలు కాలేదు. కౌన్ బనేగా కరోడ్ పతీ అంటే కృష్ణకు చాలా ఇష్టం. ఈ కార్యక్రమాన్ని అమితాబ్ చాలా గొప్పగా నడిపిస్తున్నారని కృష్ణ చాలా సార్లు అన్నారు కూడా. అలాంటి షో ఒకటి తానుచేస్తే బావుండని భావించారు. కానీ అదీ కుదరలేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.