ఓవైపు తండ్రి శతజయంతి వేడుకలు.. దీనస్థితిలో తెలుగు స్టార్ హీరో తనయులు.. సాయం కోసం ఎదురు చూపులు..

బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కాంతారావు శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొడుకు రాజా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఓవైపు తండ్రి శతజయంతి వేడుకలు.. దీనస్థితిలో తెలుగు స్టార్ హీరో తనయులు.. సాయం కోసం ఎదురు చూపులు..
Kantarao
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 17, 2022 | 8:41 AM

తెలుగు ప్రేక్షకులకు అలనాటి హీరో కాంతారావు సుపరిచితమే. దాదాపు 400లకు పైగా పౌరాణిక.. జానపద.. సాంఘిక చిత్రాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గుడిబండ అనే మారుమూల గ్రామం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన విలక్షణమైన నటనతో మెప్పించారు. బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కాంతారావు శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొడుకు రాజా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ తండ్రి ఆస్తులు అమ్ముకొని సినిమాలు తీశారని.. ఒకప్పుడు మద్రాసు బంగ్లాలో ఉన్న మేము.. ఇప్పుడు సిటీకి దూరంలో అద్దె ఇంట్లో ఉంటున్నామంటూ ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించి .. ఇల్లు కేటాయించాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన కాంతారావు శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, విశిష్ట అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ హాజరై కాంతారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంతారావు కుమారుడు రాజా, ఎన్నారై టిఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

కాంతారావు శత జయంతి కార్యక్రమాన్ని ఆయన కొడుకులిద్దరు కలిసి ఇంటి వద్ద నిర్వహించిన ఓ ఫోటోను సినీ నటుడు సీవీఎల్ నరసింహారావు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ‘తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వ పడేలా అంగరంగ వైభవంగా ఇవాళ జరిగిన కాంతారావు గారి శతజయంతి కార్యక్రమంలో ఆయన కుమారులు’ అంటూ రాసుకొచ్చారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?