Mahesh Babu: బాలకృష్ణకు థాంక్స్ చెబుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. కారణం తెలిస్తే మీరు సూపర్ అంటారు..

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు థాంక్స్ చెబుతున్నారు మహేష్ అభిమానులు. తండ్రి మరణంతో గుండె నిండా బాధతో ఉన్న సూపర్ స్టార్‏కు బాలయ్య సపోర్ట్ గా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Mahesh Babu: బాలకృష్ణకు థాంక్స్ చెబుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. కారణం తెలిస్తే మీరు సూపర్ అంటారు..
Mahesh Babu, Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 17, 2022 | 7:15 AM

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం అంత్యక్రియలు ముగిసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‏ లోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 3.45 గంటలకు కుటుంబసభ్యులు.. అభిమానుల అశ్రునయనాల మధ్య సూపర్ స్టార్‏కు తుది వీడ్కోలు పలికారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. అయితే కృష్ణ మరణవార్తను ఇటు కుటుంబసభ్యులు.. అటు అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకే ఏడాదిలో మహేష్ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. ఈఏడాది ప్రారంభంలోనే మహేష్ అన్నయ్య రమేష్ బాబు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆ సమయంలో మహేష్ కరోనా భారినా పడడంతో అన్నను చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు. ఇక సెప్టెంబర్‏లో ఆయన తల్లి ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబం మరింత దుఃఖంలో మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి కొలుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి కుటుంబానికి ఇప్పుడు కృష్ణ కూడా దూరం అయ్యారు. కృష్ణ మరణంతో మహేష్ కుటుంబం తల్లడిల్లిపోయింది. తన తండ్రి పార్థివ దేహాన్ని చూసిన మహేష్‌.. విషణ్ణ వదనంతో దుఃఖాన్ని దిగమింగుకోలేకపోయారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు థాంక్స్ చెబుతున్నారు మహేష్ అభిమానులు. తండ్రి మరణంతో గుండె నిండా బాధతో ఉన్న సూపర్ స్టార్‏కు బాలయ్య సపోర్ట్ గా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ మహేష్ ఫ్యాన్స్ బాలకృష్ణకు ఎందుకు థాంక్స్ చెబుతున్నారో తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి

అయితే బుధవారం పద్మాలయ స్టూడియోలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు అభిమానులకు వీలు కల్పించారు. ఈ క్రమంలో హీరో బాలకృష్ణ సతీసమేతంగా కృష్ణకు నివాళులర్పించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‏లో లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇక బుధవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన.. పద్మాలయ స్టూడియోస్‏కు వెళ్లి కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. హీరో మహేష్ బాబుకు ధైర్యం చెప్పారు. అయితే గత రెండు రోజులుగా విషాదంలో ఉన్న మహేష్ బాబును.. ఆయన కుమారుడు గౌతమ్ ను బాలయ్య కుశల ప్రశ్నలు అడుగుతు నవ్వించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో మొన్నటి నుంచి దుఃఖంలో ఉన్న తమ హీరోను నవ్వించినందుకు మహేష్ అభిమానులు బాలయ్యకు థాంక్స్ చెబుతున్నారు. థాంక్స్ బాలయ్య.. మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?