OTT Movies: ఈ వీకెండ్‌లో మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో

సుడిగాలి సుధీర్‌ గాలోడు, మసూద, అలిపిరికి అల్లంతదూరంలో వంటి చిన్న సినిమాలు ప్రేక్షకుల తీర్పును కోరేందుకు ముందుకు వచ్చాయి. అదే సమయంలో ఓటీటీల్లో కూడా అదిరిపోయే బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి

OTT Movies: ఈ వీకెండ్‌లో మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Nov 18, 2022 | 6:12 AM

ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు థియేటర్లలోకి అడుగుపెట్టాయి. సుడిగాలి సుధీర్‌ గాలోడు, మసూద, అలిపిరికి అల్లంతదూరంలో వంటి చిన్న సినిమాలు ప్రేక్షకుల తీర్పును కోరేందుకు ముందుకు వచ్చాయి. అదే సమయంలో ఓటీటీల్లో కూడా అదిరిపోయే బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. గతంలోథియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్ సినిమాలు కూడా డిజిటల్‌ ప్రీమియర్‌కు రెడీ అయ్యాయి. ఇక వెబ్‌సిరీస్‌ల సంగతి సరేసరి. మరి ఈ వీకెండ్‌లో  ఓటీటీల్లో అలరించే బ్లాక్‌బస్టర్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

అహ నా పెళ్లంట

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన వెబ్‌ సిరీస్‌ ఇది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. రాహుల్‌ తమడ, సాయిదీప్‌ రెడ్డి బొర్రా నిర్మించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో ఇప్పటికే అహనా పెళ్లంట సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి.

సర్దార్‌

కాలీవుడ్ హీరో కార్తీ కీలక పాత్రలో నటించిన చిత్రం సర్దార్. థియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ స్పై థ్రిల్లర్‌ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. నవంబర్ 18 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఈ సినిమా ప్రసారమవుతోంది. తమిళ్‌తో పాటు తెలుగు భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

గాడ్‌ ఫాదర్‌

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్‌హిట్‌ సినిమా గాడ్‌ఫాదర్‌. సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించారు. మోహన్‌ రాజా దర్శకుడు. దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నవంబర్‌ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ మెగా మాస్‌ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

మరికొన్ని చిత్రాలు/వెబ్ సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • ది వండర్‌ (హాలీవుడ్‌) నవంబరు- 16
  • 1899 (హాలీవుడ్‌) నవంబరు- 17
  • రిటర్న్‌ టు క్రిస్మస్‌ క్రీక్‌ (హాలీవుడ్‌)- నవంబరు 17
  • ఇలైట్‌ (హాలీవుడ్‌) నవంబరు- 18
  • స్లంబర్‌ల్యాండ్‌( హాలీవుడ్‌) నవంబరు- 18
  • ఇన్‌సైడ్‌ జాబ్‌ (సిరీస్‌) నవంబరు- 18
  • రెజిన్‌ సుప్రీం సీజన్‌-1 (ఫ్రెంచ్‌)- నవంబరు 18

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • హాస్టల్‌డేజ్‌ సీజన్‌-3 (వెబ్‌సిరీస్‌-హిందీ)- నవంబర్ 16
  • ది సెక్స్‌లైవ్స్‌ ఆఫ్‌ కాలేజ్‌గర్ల్స్‌ (వెబ్‌సిరీస్‌)- నవంబర్ 18

డిస్నీ+ హాట్‌స్టార్‌

  • ది సాంటా క్లాజ్‌- నవంబరు 16
  • ఐరావతం (తమిళం/తెలుగు) – నవంబరు 17
  • సీతారామం (తమిళ్‌)- నవంబరు 18

సోనీ లివ్‌

  • అనల్‌ మీలే పని తులి (తమిళ్‌)- నవంబరు 18
  • వండర్‌ ఉమెన్‌ (తెలుగు)- నవంబరు 18

జీ5

  • కంట్రీ మాఫియా (వెబ్‌సిరీస్‌)- నవంబరు 18

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..