Darsheel Safary: తారే జమీన్ పర్ చిల్డ్ యాక్టర్ ఇప్పుడు ఎలా ఉన్నడో చూసారా? తాను వంకర పళ్లతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నంటూ..

తన వ్యక్తిగత జీవితంలో ఎత్తు పళ్లు, దంతాలు, ప్రతిదానికీ ఎగతాళి చేసేవారని.. నీ దంతాలు 1 కిలోమీటరు దూరంలో ఉన్నాయంటూ ఎద్దేవా చేసేవారని గుర్తు చేసుకున్నాడు. అయితే తనకు ఈ రకమైన పళ్ల వల్లే సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పాడు

Darsheel Safary: తారే జమీన్ పర్ చిల్డ్ యాక్టర్ ఇప్పుడు ఎలా ఉన్నడో చూసారా? తాను వంకర పళ్లతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నంటూ..
Darsheel Safary Chilhood Pi
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2022 | 9:23 PM

నటుడు దర్షీల్ సఫారీ అంటే గుర్తుకొస్తాడో లేదో కానీ.. తారే జమీన్ పర్ లోని బాలనటుడు అని అన్న వెంటనే ప్రతి ఒక్కరి కనుల ముందు అమాయమైన కళ్ళు, చిరునవ్వుతో నిండిన ఒక బాలనటుడి రూపం కనుల ముందుకు వస్తుంది. ఆ బాలనటుడు ఇప్పుడు రొమాంటిక్ హీరో అయ్యాడు. తాజాగా దర్షీల్ సఫారీ నటించిన “క్యాపిటల్ ఎ, స్మాల్ ఎ ” అనే షార్ట్ ఫిల్మ్  నవంబర్ 17న అమెజాన్ మినీ టీవీలో రిలీజ్ అయింది. ఈ చిత్రంలో దర్షీల్ సఫారీ, రేవతి పిళ్లై తమ ఎత్తులో తేడాలతో ఇబ్బందులు యూదుర్కొంటున్న ఓ యువ జంటగా నటించారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఈ యువ నటుడు దర్శీల్ ఈ చిత్రం గురించి.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అపహాస్యం అనేక విషయాలను వెల్లడించాడు. అంతేకాదు తారే జమీన్ పర్ తన జీవితంలో ఎంత గొప్ప పాత్రగా  మిగిలిపోయింది అనే విషయం కూడా పేర్కొన్నాడు.

క్యాపిటల్ ఎలో ఛాలెంజింగ్ పాత్ర అని దర్శీల్ చెపుతున్నాడు. స్క్రీన్ పై తనకు, రేవతికి మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసాన్ని అందరూ ఒప్పించేలా సృష్టించడం కోసం చిత్ర యూనిట్ చేసిన కసరత్తుని వెల్లడించాడు. తనను చాలా పొట్టిగా ఎలా చూపించాలని మేకర్స్ ఆలోచించారు. అయితే తాను దర్శకుడికి నేను పొట్టిగా కనిపించడం కోసం కిందకు వంగి ఉంటానని చెప్పానని..ఎందుకంటే తాను నటించే పాత్రలో సహజంగా కనిపించేలా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. తన పాత్ర చాలా ఒత్తిడి కలిగించేది అయినా అంతకంటే  సరదాగా ఉంది, ”అని దర్శీల్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఒక వ్యక్తికి కొన్ని విషయాలు ఎంతటి అభద్రతాభావాన్ని ఇస్తుంది.. ఎంతటి సంక్లిష్టతను కలిగిస్తుందో ఈ చిత్రం ద్వారా తెలుస్తుందన్నాడు దర్షీల్. తనకు  10 ఏళ్ల వయసు నుంచి ఎన్నో విమర్శలు, రకరకాల కామెంట్స్ చేశారని ఇలాంటి ప్రజాభిప్రాయం తనకు కొత్తమీ కాదన్నాడు దర్శీల్‌.  అంతేకాదు తాను సాధారణమైన సున్నితమైన పిల్లవాడిని. వారు తరచుగా నా వంకర పళ్లను చూసి అనే మాటలు అన్నీ బాధపెట్టేవని తన చిన్నతనంలో ఎదుర్కొన్న విమర్శల గురించి గుర్తు చేసుకున్నాడు దర్షీల్. తాను నటుడిగా మారినప్పుడు.. నువ్వు ఎక్కువగా మాట్లాడకుండా స్తబ్దుగా ఉండాలి… అయితే అన్ని విషయాలకు కాదు అని చెప్పారు.. కొన్నిటికి మాత్రమే అని చెప్పారు.. నేను అదే అనుసరించాను.. అయితే కొందరు దర్శీల్‌కి నటన ఇష్టం లేదు అని పుకార్లు పుట్టించారు.. అది పూర్తిగా అవాస్తవం అని చెప్పాడు.

తన వ్యక్తిగత జీవితంలో 10 ఏళ్ల వయసులో అనేక విషయాలపై అపహాస్యం, జోకులు ఎదుర్కొన్నానని నటుడు తెలిపారు. తన వ్యక్తిగత జీవితంలో ఎత్తు పళ్లు, దంతాలు, ప్రతిదానికీ ఎగతాళి చేసేవారని.. నీ దంతాలు 1 కిలోమీటరు దూరంలో ఉన్నాయంటూ ఎద్దేవా చేసేవారని గుర్తు చేసుకున్నాడు. అయితే తనకు ఈ రకమైన పళ్ల వల్లే సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పాడు. తాను ప్రతి దానిని చూసే విధానం ఏమిటనేది ఈ విషయంలోనే నేర్చుకున్నానని ఈ 25 ఏళ్ల యువకుడు గుర్తుచేసుకున్నాడు.

తారే జమీన్ పర్ విడుదలై.. బాక్సాఫీస్ వద్ద విమర్శలకుల ప్రసంసలను అందుకుని..  గ్రాండ్ సక్సెస్ అయి 15 ఏళ్లు పూర్తయ్యాయి. దర్శీల్ అప్పటి నుండి అనేక టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలు , షార్ట్ ఫిల్మ్‌లు చేసాడు. ఇంకా, అతని పేరు  ఎవరు చెప్పినా వెంటనే తొలి చిత్రంగుర్తుకొస్తుంది. తారే జమీన్ పర్’ సినిమాలో చదువుల్లో వెనుకబడిన విద్యార్థిగా దర్షీల్ నటన దేశ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంది. మట్టిలో మాణిక్యం వంటి స్టూడెంట్ లోని ప్రతిభను గుర్తు పట్టి.. అతడిని సాన బట్టి వజ్రంగా మార్చిన ఉపాద్యాయుడు గా అమీర్ ఖాన్.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అందరి మదిని తాకింది. ఇప్పుడు ఆ బాలనటుడు 25 ఏళ్ల యువకుడిగా మారి.. హీరోగా ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘క్యాపిటల్ ఎ స్మాల్ ఎ’సిరీస్ ఇవాళే విడుదల అయింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..