Asin: గజిని హీరోయిన్‌ ఆసిన్‌ గారాలపట్టిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..

స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ ఉంటున్న సమయంలోనే 2016లో రాహుల్‌ శర్మ అనే వ్యాపారవేత్తతో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది ఆసిన్‌.

Asin: గజిని హీరోయిన్‌ ఆసిన్‌ గారాలపట్టిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో..
Asin
Follow us
Basha Shek

|

Updated on: Nov 18, 2022 | 6:04 AM

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయితో టాలీవుడ్‌కు పరిచయమైన కేరళ కుట్టి ఆసిన్‌. ఆతర్వాత గజిని, శివమణి, ఘర్షణ, లక్ష్మీ నరసింహ, చక్రం, దశావతారం, అన్నవరం తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ సినిమాల్లోనూ నటించి అక్కడి ఆడియెన్స్‌ను మెప్పించిందీ అందాల తార. స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ ఉంటున్న సమయంలోనే 2016లో రాహుల్‌ శర్మ అనే వ్యాపారవేత్తతో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది ఆసిన్‌. కాగా 2017 అక్టోబర్‌లో ఆసిన్‌ దంపతులకు అరిన్‌ అనే కూతురు జన్మించింది. అప్పటి నుంచి అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న అసిన్‌.. అప్పుడప్పుడు తన కూతురుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుని మురిసిపోతోంది.

0

ఇవి కూడా చదవండి

అలా తాజాగా అసిన్‌ తన కూతురు అరిన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది. ఈ ఫొటోల్లో అరిన్‌ తన తండ్రి రాహుల్‌ శర్మకు మేకప్‌ వేస్తూ కనిపించింది. లిప్‌స్టిక్‌, ఐ షాడోస్‌, కాంపాక్ట్‌ వేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా బాలీవుడ్‌లోనూ క్రేజ్‌ సొంతం చేసుకున్న ఆసిన్‌ గజిని హిందీ రీమేక్‌లో ఆమీర్‌ఖాన్‌, రెడీ రీమేక్‌ లో సల్మాన్‌ సరసన, అక్షయ్‌తో కలిసి హౌస్‌ఫుల్, ఖిలాడీ 786 వంటి హిట్‌ సినిమాల్లో నటించింది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే