Rajitha Chanti |
Updated on: Nov 17, 2022 | 1:59 PM
బాలీవుడ్ ఇండస్ట్రీలో సుధీర్ఘ కాలంగా కొనసాగుతున్న హీరోయిన్లలో కత్రీనా కైఫ్ ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ అమ్మడు కెరీర్ సాగుతుంది.
అటు బాలీవుడ్లోనే కాకుండా.. ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను సైతం తన అందం, అభినయంతో ఆకట్టుకుంది కత్రీనా.
కత్రీనా కైఫ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి ఇరవై ఏళ్లు అయినా కూడా క్రేజ్ తగ్గలేదు.. ఇక అందుకు తగినట్లుగానే ఆమె పారితోషికం ను కూడా అందుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు అందుకున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ లో అతి తక్కువ మంది ముద్దుగుమ్మలు మాత్రమే పది కోట్లు అంతకు మించి పారితోషికం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కత్రీనా కూడా ఆ జాబితాలో చేరి పోయింది.
కత్రీనా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా క్రేజ్ తగ్గలేదు. ఒక్కో సినిమాకు ఆమె ఏకంగా రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
అయితే కొద్ది రోజులుగా బాలీవుడ్ వరుస పరాజయాలతో విలవిలలాడిపోతుంది. దీంతో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించేందుకు అటు డైరెక్టర్స్.. ఇటు ప్రొడ్యూసర్స్ వెనకాడుతున్నారు.
ఈక్రమంలో ఇప్పుడు కత్రీనా రెమ్యునరేషన్ ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక సినిమాకు ఐశ్వర్య రాయ్ పది కోట్ల రూపాయల పారితోషికం తీసుకుందట.
పెళ్లైనా ఏమాత్రం తగ్గని మళ్లీశ్వరి క్రేజ్.. ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..