Python: వీళ్లు పిల్లలు కాదు పిడుగులు.. మేకను మింగేందుకు యత్నించిన కొండచిలువను ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు
మేక కూడా తన ప్రాణాలపై ఆశలు వదులుకుంటుంది. ఈ సమయంలోనే అక్కడకు వచ్చిన కొందరు పిల్లలు దీన్ని గమనిస్తారు. మొదట కొండ చిలువను చూసి వారు భయపడిపోతారు.
ఈ భూమ్మీద చాలా ప్రమాదకరమైన జీవుల్లో కొండచిలువ కూడా ఒకటి. ఎలాంటి జీవులనైనా ఇవి అమాంతం చుట్టేసి మింగేస్తాయి. ఒకసారి వీటి బారిన పడితే తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఈక్రమంలో ఒక మేక కూడా ఈ ప్రమాదకరమైన జంతువు బారిన పడింది. గడ్డిమేస్తున్న మేకల గుంపు వద్దకు వచ్చిన కొండచిలువ అదును చూసి ఓ మేకను చుట్టేసింది. దానిని ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది. మింగేందుకు ప్రయత్నం చేస్తుండగా మేక తీవ్రంగా ప్రతిఘటించింది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయితే కొండచిలువ మాత్రం దాన్ని వదలకుండా మరింత గట్టిగా పట్టుకుంటుంది. ఇక మేక కూడా తన ప్రాణాలపై ఆశలు వదులుకుంటుంది. ఈ సమయంలోనే అక్కడకు వచ్చిన కొందరు పిల్లలు దీన్ని గమనిస్తారు. మొదట కొండ చిలువను చూసి భయపడిపోతారు. అయితే దాని చేతిలో చిక్కుకున్న మేక ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారు.
భయపడుతూనే కట్టెపుల్లలతో కొండచిలువను కొడతారు. ఒకరు తోకను, మరొకరు తలను పట్టుకుని కొండచిలువ నుంచి మేకను విడిపించే ప్రయత్నం చేస్తారు. చివరకు ఎలాగోలా కొండచిలువను పక్కకు లాగేస్తారు. దీంతో మేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పిల్లల ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొందరు వీడియోల కోసం కావాలనే ఇలా చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం పిల్లలు, మూగ జీవాలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదంటూ హిత భోద చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..