Wife and Husband: ఒకసారి కాదు మూడుసార్లు ఇంటి నుంచి ఎస్కేప్ అయిన భార్య.. చివరికి ఆ భర్త ఏం చేశాడంటే..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Nov 19, 2022 | 1:13 PM

పెళ్లి అయిన తరువాత డోలీలో లేదా ప్రత్యేక వాహనంలో పెళ్లి కూతురుని అత్తారింటికి సాగనంపడం మనకు తెలిసిందే. కానీ, కర్రతో చావు దెబ్బలు కొట్టి భార్యను కాపురానికి..

Wife and Husband: ఒకసారి కాదు మూడుసార్లు ఇంటి నుంచి ఎస్కేప్ అయిన భార్య.. చివరికి ఆ భర్త ఏం చేశాడంటే..
Wife Escape From Husband

పెళ్లి అయిన తరువాత డోలీలో లేదా ప్రత్యేక వాహనంలో పెళ్లి కూతురుని అత్తారింటికి సాగనంపడం మనకు తెలిసిందే. కానీ, కర్రతో చావు దెబ్బలు కొట్టి భార్యను కాపురానికి పంపడం ఎప్పుడైనా చూశారా? ఉత్తరప్రదేశ్‌లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఓ గ్రామంలో గ్రామ పెద్ద.. ఓ మహిళను కర్రతో విచక్షణారహితంగా కొట్టి అత్తారింటికి కాపురానికి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా, ఆ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గర్వా జిల్లాలోని కేతార్ బ్లాక్‌లోని పానియాఖో పంచాయతీకి చెందిన కృపా సింగ్ కుమార్తె శాంతి కుమారికి, యూపీలోని సోన్‌భద్ర జిల్లా మజిగవాన్‌కి చెందిన మనోజ్ సింగ్‌కి ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే, పెళ్లి అయిన కొద్ది రోజులకే శాంతి తన భర్త ఇంటి నుంచి ఎస్కేప్ అయ్యింది. మెట్టినిల్లు వదిలి, పుట్టింటికి పారిపోయి వచ్చింది. కట్నం కోసం అత్తమామలు తనను హింసించారంటూ ఆరోపిస్తూ పుట్టింట్లోనే ఉండిపోయింది.

అయితే, తన భార్య శాంతిని కాపురానికి తీసుకెళ్లేందుకు భర్త మనోజ్ సింగ్.. అత్తారింటికి వచ్చాడు. వస్తూ వస్తూ తన వెంట గ్రామ పంచాయితీ పెద్ద ఇస్తియాక్ అన్సారీని కూడా వెంట తీసుకువచ్చాడు. భార్య ఇంటికి వెళ్లడానికి ముందు.. ఆమె గ్రామానికి చెందిన ప్రధానాధికారి మున్నీదేవిని సంప్రదించాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తన భార్యను తన వెంట పంపాలని మనోజ్ సింగ్ కోరాడు. లేదంటే.. పెళ్లికి ఖర్చు చేసిన రూ. 1.5 లక్షలు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. ఇదే విషయంపై పంచాయితీ కూడా తీర్మానం చేసింది.

పారిపోవడానికి ప్రయత్నించిన భార్య..

రెండింట్లో ఏ నిర్ణయం తీసుకుంటారంటూ పంచాయతీ పెద్దలు.. మహిళ తండ్రి కృపా సింగ్‌ను ప్రశ్నించారు. దీంతో శాంతిని తన భర్త మనోజ్‌తో పంపేందుకు అంగీకరించారు ఆమె పేరెంట్స్. ఇదే విషయంపై కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానం కూడా చేశారు. అయితే, పెద్దల సమక్షంలో తన భర్తతో వెళ్లేందుకు అంగీకరించిన శాంతి.. ప్రయాణ మార్గంలో తన భర్త మనోజ్‌పై దాడి చేసి పారిపోయింది.

కర్రతో కొట్టిన వైనం..

వెంటనే శాంతి గ్రామానికి చేరుకున్న మనోజ్.. ఆమె కుటుంబ సభ్యులు, గ్రామ పంచాయితీ పెద్దలకు సమాచారం అందించారు. వారి సాయంతో శాంతిని వెతికి పట్టుకున్నారు. మళ్లీ పంచాయితీ పెట్టగా.. అత్తమామల ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది శాంతి. దాంతో ఆగ్రహానికి గురైన పంచాయితీ ప్రధానాధికారి మున్నీదేవి.. చేతి కర్రతో శాంతి కుమారిని పొట్టు పొట్టుగా కొట్టింది. బలవంతంగా అత్తమామల ఇంటికి పంపించింది. శాంతిని కొట్టడాన్ని కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.

మళ్లీ పరార్..

బలవంతంగా అత్తమామల ఇంటికి పంపించినా.. మళ్లీ అదే పని చేసింది శాంతి కుమారి. అత్తమామల ఇంటికి వెళ్లినట్లే వెళ్లి.. మరోసారి ఎస్కేప్ అయ్యింది. పరారైన భార్య కోసం భర్త, అత్తమామలు, ఆమె తల్లిదండ్రులు విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే, శాంతిని కొట్టిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది అధికారుల కంట పడటంతో చర్యలకు ఉపక్రమించారు. ఇష్టం లేని పెళ్లి చేయడమే కాకుండా, ఆమెపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు అధికారులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu