Maha Vikas Aghadi: మహా వికాస్ అఘాడీ కూటమిలో లుకలుకలు.. హిందూనేతపై రాహుల్ వ్యాఖ్యలే కారణం..

కాంగ్రెస్ శ్రేణులలో భారత్ జోడో యాత్ర నూతనోత్సాహాన్ని కలగజేస్తున్నదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే మరోవైపు ఈ యాత్రలో రాహుల్ చేస్తున్న వ్యాఖ్యల కారణంగా..

Maha Vikas Aghadi: మహా వికాస్ అఘాడీ కూటమిలో లుకలుకలు.. హిందూనేతపై రాహుల్ వ్యాఖ్యలే కారణం..
Maha Vikas Aghadi
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 19, 2022 | 1:46 PM

భారత జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులలో ఈ యాత్ర నూతనోత్సాహాన్ని కలగజేస్తున్నదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే మరోవైపు ఈ యాత్రలో రాహుల్ చేస్తున్న వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్‌తో కూటమిగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆ పార్టీకి దూరం అయ్యే ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నాయి. అలాంటి వ్యాఖ్యలే రాహుల్ గాంధీ మహారాష్ట్రలో చేయడంతో శివసేన నుంచి బెదిరింపులు వచ్చాయి. అది ఎలాగంటే.. శుక్రవారం బుల్దానా జిల్లాలోని షెగావ్‌లో జరిగిన భారత్ జోడో యాత్ర ర్యాలీలో వినాయక్ దామోదర్ సావర్కర్‌ను ప్రస్తావించకుండా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆయనపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హిందుత్వ సిద్ధాంతకర్త గురించి మరోసారి ప్రస్తావిస్తే మహా వికాస్ అఘాడీ(ఎమ్‌వీఏ) నుంచి వైదొలుగుతామని కాంగ్రెస్‌ను శివసేన హెచ్చరించింది. సావర్కర్‌పై రాహుల్‌గాంధీ చేసిన పలు ‘అసమర్థ’ వ్యాఖ్యలు ఎమ్‌వీఏ కూటమి ఐక్యతను ప్రభావితం చేస్తాయని ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం శుక్రవారం కాంగ్రెస్‌ అధినేత రాహుల్ గాంధీని, ఆ పార్టీని హెచ్చరించింది. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ సమర్థించారు.

అయితే ఆ వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్రలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ, ఇతర హిందూ సంస్థలు నిరసనలు చేపట్టాయి. ఇదే క్రమంలో నాసిక్ జిల్లాలోని సావర్కర్ జన్మస్థలమైన భాగూర్‌లో బంద్ పాటించారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన కీలక నాయకుడు సంజయ్ రౌత్, జైరామ్ రమేష్ తనను పిలిచారని, ఈ అంశంపై ఇద్దరూ సుదీర్ఘంగా మాట్లాడుకున్నారని చెప్పారు. విలేకరులతో రౌత్ మాట్లాడుతూ..‘‘సావర్కర్‌కు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు శివసేనకు ఆమోదయోగ్యం కాదు. గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. ఎక్కువగా మహారాష్ట్రలో నిరుద్యోగం, రైతుల సమస్యలు వంటి ముఖ్యమైన అంశాలపై రాహుల్ చర్చలు లేవనెత్తుతున్నారు. కానీ, వీర్ సావర్కర్ అంశాన్ని లేవనెత్తడానికి ఎటువంటి కారణం రాహుల్ వద్ద లేదు. మేము వీర్ సావర్కర్‌ను ఆరాధిస్తున్నందున ఇలాంటి వ్యాఖ్యలు మహావికాస్ అఘాడీలో చీలికలకు దారి తీస్తుంద’’ని ఆయన అన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, శివసేన పార్టీలతో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది.

కాగా,  గురువారం అకోలా జిల్లాలోని వాడేగావ్‌లో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సావర్కర్ బ్రిటిష్ వారికి సహాయం చేశారని, భయంతో వారికి క్షమాభిక్ష లేఖలు రాశారని ఆరోపించారు. సావర్కర్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు శివసేనతో పాటు మహారాష్ట్రలోని కాంగ్రెస్ నాయకులపై కూడా ప్రభావం చూపింది. వీర్‌ సావర్కర్‌ పట్ల దేశంలోని చాలా మంది ప్రజలకు  గౌరవాభిమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఓ కార్యకర్త రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి..