‘పోర్న్ వీడియోలో ఉన్నట్లే చేయమంటాడు’.. విసిగిపోయిన భార్య చివరికి ఏం చేసిందంటే..

పోర్న్ వీడియోలను స్పూర్తిగా తీసుకుని తనను పదేపదే అసహాజ శృంగారంలో పాల్గొనాలంటూ బెదిరిస్తున్నాడని..

‘పోర్న్ వీడియోలో ఉన్నట్లే చేయమంటాడు’.. విసిగిపోయిన భార్య చివరికి ఏం చేసిందంటే..
Crime
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 20, 2022 | 10:25 AM

భార్యాభర్తల మధ్య సన్నిహిత సంబంధం అనేది కామన్. పెళ్లి తరువాత శారీరక కలయిక వారి బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. అందుకే.. ప్రతి జంట తమ హనీమూన్‌ స్వీట్ మెమోరీగా ఉండేందుకు విదేశాలకో, మంచి ప్లేసెస్‌లో ప్లాన్ చేసుకుంటారు. శృంగారం ఒక మధురానుభూతి. అది సహజంగా అయితేనే దంపతులిద్దరి జీవితం సాఫీగా ఉంటుంది. కానీ, కొందరు మగాళ్లు విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడుతారు. వింత పోకడలతో తమ భాగస్వాములను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటారు. తాజాగా ఓ నీచుడు కూడా అదే పని చేశాడు. పోర్న్ వీడియోలను స్పూర్తిగా తీసుకుని తన భార్యను అసహజ శృంగారంలో పాల్గొనాలంటూ తీవ్ర వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. తనను పదేపదే అసహాజ సెక్స్‌లో  పాల్గొనాలంటూ బెదిరిస్తున్నాడని.. అత్తమామలకు చెప్పినా.. వాళ్లు తమ కొడుకుకే సపోర్ట్ చేస్తున్నారని అతడి భార్య.. భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది అలీఘర్‌కు చెందిన ఓ మహిళ.

‘నా భర్తకు పోర్న్ క్లిప్స్, వీడియోలు చూసే అలవాటు ఉంది. ఆ తర్వాత అందులో చూసినట్లుగా చేయాలని.. అసహజ శృంగారంలో పాల్గొనాలని డిమాండ్ చేసేవాడు. నాకు కూడా ఆ అసభ్యకర వీడియోలు చూపించి, సెక్స్ కోసం అసహజమైన డిమాండ్లు చేసేవాడని’ సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు ఈ విషయాన్ని అత్తమామలకు ఎంత చెప్పినా.. వారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె వాపోయింది. ‘ఇలాంటివి సహజమేనని’ భర్త చెప్పినట్లుగా వినాలని తన అత్త చెప్పుకొచ్చేదని పేర్కొంది. తమ కొడుకునే సపోర్ట్ చేశారని ఆమె పోలీసులకు చెప్పింది. పెళ్లయిన కొంతకాలం వరకు భార్యాభర్తల మధ్య అంతా బాగానే ఉండేదని.. ఆ తర్వాతే వేధింపులు మొదలయ్యాయని బాధితురాలి తల్లి చెప్పింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(Source)