Chandigarh: లవ్లీ యూనివర్సిటీ మెస్‌లో దారుణం.. మండిపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు..

యూనివర్సిటీలలో చదువులంటే విద్యార్థులతో సహా వారి తల్లిదండ్రులకు కూడా ఎన్నో ఊహలు ఉంటాయి. అక్కడ విద్యార్థులు అన్ని రకాల వసతులతో సహా ప్రశాంత వాతావరణంలో..

Chandigarh: లవ్లీ యూనివర్సిటీ మెస్‌లో దారుణం.. మండిపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు..
Rat In Food
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 19, 2022 | 2:22 PM

యూనివర్సిటీలలో చదువులంటే విద్యార్థులతో సహా వారి తల్లిదండ్రులకు కూడా ఎన్నో ఊహలు ఉంటాయి. అక్కడ విద్యార్థులు అన్ని రకాల వసతులతో సహా ప్రశాంత వాతావరణంలో విద్యనభ్యసిస్తారని అందరూ భావిస్తుంటారు. అవి అన్ని యూనివర్సిటీలలో, ఇంకా అన్ని వేళల్లో నిజం కాకపోవచ్చని చెప్పుకునేలా అనేక సందర్భాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే చండీఘడ్‌ లోని ఓ యూనివర్సిటీలో ఓ దారుణం జరిగింది. యూనివర్సిటీ మెస్‌ నిర్వాహకులు విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థులు తినే పప్పులో ఓ ఎలుక ఉంది. దీనిపై మెస్ నిర్వాహకులను ప్రశ్నించగా..‘ఇది చాలా సాధారణమైన విషయం’ అని సమాధానమిచ్చారు. మెస్ నిర్వాహాకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చండీఘడ్‌లోని  లవ్లీ యూనివర్సిటీలో శుక్రవారం రాత్రి విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఈ దారుణం జరిగింది.

విద్యార్థుల తినే పప్పులో ఎలుక ఉండడం చూసి, అక్కడ ఉన్న వారందరూ షాక్‌ అయ్యారు. ఈ విషయమై మెస్‌ నిర్వాహకులను సదరన్ స్పైస్ ఓనర్‌ను ప్రశ్నించగా..ఇది చాలా సర్వసాధారణ విషయం అన్నట్టు సమాధానం ఇచ్చారు. దీంతో హాస్టల్ విద్యార్థులంతా కలిసి నిరసన చేపట్టారు. ఇంకా నిర్లక్షంగా సమాధానమిచ్చిన మెస్ నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

కాగా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన యూనివర్సిటీలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా ఒకటి. ఈ యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు . అయితే అన్ని విధాలుగా మంచి పేరు తెచ్చుకున్న ఈ యూనివర్సిటీ విద్యార్ధులకు మాత్రం మెరుగైన భోజన సదుపాయాలను అందించడంలో విఫలమైంది. విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల గురించి ఆలోచించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి..