AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhya Pradesh: ఆసుపత్రిలోకి వెళ్లి స్వేచ్ఛగా విహరించిన అనుకోని అతిథి.. నిర్లక్ష్యం కారణంగా సిబ్బంది తొలగింపు..

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో.. శుక్రవారం రోగులందరూ అడ్మిట్ కావడానికి, సరైన చికిత్స పొందేందుకు కష్టపడుతుండగా ఎవరూ ఊహించని..

Madhya Pradesh: ఆసుపత్రిలోకి వెళ్లి స్వేచ్ఛగా విహరించిన అనుకోని అతిథి.. నిర్లక్ష్యం కారణంగా సిబ్బంది తొలగింపు..
Cow In Hospital
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 19, 2022 | 3:24 PM

Share

ఎక్కడైనా అసుపత్రికి మనుషులే వెళ్తారు. అలాగే వెటర్నరీ అసుపత్రికి పశువులను తీసుకెళ్తారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వాసుపత్రికి అనుకోని అతిథి వెళ్లారు. ఆసుపత్రి సిబ్బంది అంతా తమ తమ పనులలో నిమగ్నులై ఉన్న సమయంలో ఈ అతిథి అక్కడకు వెళ్లి విహరించింది. తనను ఆపేవారు ఎవరూ లేకపోవడంతో ఆ అతిథి ఏకంగా ఐసీయూ వార్డులోకి కూడా వెళ్లి తిరగాడింది. ఈ అనుకోని అతిథికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో.. శుక్రవారం రోగులందరూ అడ్మిట్ కావడానికి, సరైన చికిత్స పొందేందుకు కష్టపడుతుండగా ఎవరూ ఊహించని విధంగా అక్కడకు ఒక ఆవు వచ్చి స్వేచ్ఛగా తిరగాడింది. ఆ ఆవును అక్కడనుంచి పంపించేవారు ఎవరూ లేకపోవడంతో నేరుగా ఆసుపత్రిలోని ఐసియు వార్డులోకి వెళ్లింది. వార్డులో ఉన్న ఎవరో ఆవు తిరుగుతున్నట్లు చూసి వీడియో తీసి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది అంతా ఉలిక్కిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన సీనియర్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ..ఆసుపత్రిలో పనిచేసే ఒక సెక్యూరిటీ గార్డు సహా ముగ్గురు సిబ్బందిని వారి ఉద్యోగాల నుంచి తొలగించారు. అయితే.. ప్రభుత్వ వైద్యశాలల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున ఇలాంటి ఘటనలు సర్వసాధారణమ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా అధికారుల, అసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరగింది. అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేనే అధికారులు అప్రమత్తమయ్యారు. లేకపోతే పరిస్థితి అదుపులో లేకుండా పోయేదని ఆసుపత్రికి వచ్చిన రోగులు అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి..