AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satyendar Jain Video: వైద్యుల సూచనలతోనే జైలులో మసాజ్ చేయించుకుంటున్నారు.. సీసీటీవీ వీడియోపై క్లారిటీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ..

జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలులో మసాజ్ చేయించుకుంటున్న సీసీటీవీ వీడియో బయటకు రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ టార్గెట్ చేసింది. ఈ వ్యవహారం సాగుతున్న క్రమంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దీనిపై క్లారిటీ ఇచ్చారు. సత్యేందర్ జైన్ జైల్లో పడిపోవడం వల్ల వెన్నెముకకు గాయమైందని.. వైద్యుల సలహాతోనే..

Satyendar Jain Video: వైద్యుల సూచనలతోనే జైలులో మసాజ్ చేయించుకుంటున్నారు.. సీసీటీవీ వీడియోపై క్లారిటీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ..
Satyendar Jain
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 19, 2022 | 4:52 PM

తీహార్‌ జైల్లో ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌కు మసాజ్‌పై బీజేపీ ఆప్‌ నేతల మధ్య మాటలయుద్దం మరింత ముదిరింది. ఆప్‌ నేతల అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట అని బీజేపీ విమర్శించింది. అయితే బీజేపీ కామెంట్స్‌కు కైంటర్ ఇంచ్చింది ఆప్. రెండు సర్జరీలు జరిగిన పేషంట్‌కు డాక్టర్ల సలహా మీద ఫిజియోథెరపీ చేస్తే దానిని వీడియో తీసి బీజేపీ నేతలు ఎన్నికల లబ్ధి కోసం ఉపయోగించడం సిగ్గుచేటని ఆప్‌ విమర్శించింది. సీఎం కేజ్రీవాల్‌ అండ తోనే సత్యేంద్రజైన్‌కు తీహార్‌ జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నాయని బీజేపీ నేత గౌరవ్‌ భాటియా ఆరోపించారు. తీహార్‌ జైలు నుంచి సత్యేంద్రజైన్‌ వసూళ్ల రాకెట్‌ నడిపిస్తున్నారని ఆరోపించారు. అవినీతిలో కేజ్రీవాల్‌కు సత్యేంద్రజైన్‌ అన్న లాంటి వాడని అన్నారు. తీహార్‌ జైల్లో ఉన్న మోసగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌తో సత్యేంద్రజైన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.

అయితే సత్యేంద్రజైన్‌పై బీజేపీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా. జైల్లో ఉన్నపప్పుడే సత్యేంద్రజైన్‌కు రెండు సర్జరీలు జరిగాయని, డాక్టర్ల సలహా మేరకు ఆయనకు జైల్లో ఫిజియోథెరపీ జరుగుతోందన్నారు. ఓ పేషంట్‌కు జరుగుతున్న ఫిజియోథెరపీని కూడా వీడియో తీసి బీజేపీ ఎన్నికల్లో లబ్ది కోసం వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు మనీష్‌. వెన్నెముకకు గాయం అయినందున ఫిజియోథెరపీ తీసుకోవాలని వైద్యులు సూచించారని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి చికిత్సకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని లీక్ చేయడం ద్వారా బీజేపీ మాత్రమే క్రూరమైన జోకులు వేయగలదని.. సత్యేందర్ జైన్ వెన్నెముక దెబ్బతిన్నదని.. అది రికార్డులో ఉందన్నారు మనీష్ సిసోడియా.

మే 30న ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి సత్యేంద్ర జైన్ ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను వేధిస్తున్నదని అతని లాయర్లు కోర్టులో పేర్కొన్నారు. ఒక్కటే కారణం, ఆయన రాజకీయ ప్రముఖుడు. ఆగస్టు 24, 2017న సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను అనుసరించి సత్యేంద్ర జైన్‌పై మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఇంతలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా యూపీ మంత్రి సత్యేంద్ర జైన్ జైల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మంత్రి జైలు బెడ్‌పై పడుకుని ఉన్నారు. కొన్ని పేపర్లను చదువుతుండగా ఓ వ్యక్తి అతని మంచం పక్కన కూర్చున్నారు. మంత్రి పాదాలకు మసాజ్ చేస్తున్నదెవరనేది తెలియరాలేదు. ఇక  మంత్రి జైలు బెడ్‌పై పడుకుని పాదాలకు మసాజ్‌ ఆ వీడియోను ఒక్కడ చూడవచ్చు-

మరిన్ని జాతీయ వార్తల కోసం