Gujarat Polls 2022: సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని ఐఏయస్ అధికారిని తొలగించిన ఈసీ.. వివరాలు తెలుసుకుందాం రాండి..
ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏయస్ అధికారి అభిషేక్ సింగ్‌ను గుజరాత్ ఎన్నికలడ్యూటీలో ఎన్నికల సంఘం నియమించింది. అయితే అభిషేక్ ఆ విషయాన్ని సూచించేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో..

ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏయస్ అధికారి అభిషేక్ సింగ్‌ను గుజరాత్ ఎన్నికలడ్యూటీలో ఎన్నికల సంఘం నియమించింది. అయితే అభిషేక్ ఆ విషయాన్ని సూచించేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అది కాస్తా వైరల్ అయి వివాదాలకు దారితీసింది. సోషల్ మీడియాలో తన కొత్త అసైన్‌మెంట్ గురించి పోస్ట్ చేసినందుకు ఎన్నికల సంఘం అతన్ని గుజరాత్ ఎన్నికల డ్యూటీ నుండి తొలగించింది. అభిషేక్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో “ప్రజల డబ్బుతో కొనుగోలు చేసిన కారులో, పబ్లిక్ డ్యూటీ కోసం, పబ్లిక్ అధికారులతో, ప్రజలకు కమ్యూనికేట్ చేస్తున్నారు ఈ పబ్లిక్ సర్వెంట్. ఇది ప్రచారం లేదా స్టంట్ కాదు’’ అని అభిషేక్ తెలిపారు.
అయితే అహ్మదాబాద్‌లోని బాపునగర్, అసర్వాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్‌గా అభిషేక్ సింగ్‌ను నియమించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ప్రకటన అనుసారం అతను తన బాధ్యతలను నిర్వర్తించబోతున్నట్లు అభిషేక్ రాసుకొచ్చారు. ఇదే విషయాన్ని అతను తన ఇన్‌స్టాగ్రా, ట్విట్టర్‌లో రెండు ఫోటోల ద్వారా తెలియజేశారు. ఒకదానిలో తన అధికారిక కారు పక్కన నిలబడి అభిషేక్ నిలబడి ఉన్నారు. మరోఫొటోలో అతను మరో ముగ్గురు అధికారులు, ఒక సెక్యూరిటీ వ్యక్తితో ఉన్నారు.




I accept the Hon’ble ECI’s decision with all humility ? Though I believe there’s nothing wrong in this post. A public servant, in a car bought by public’s money, reporting for public duty,with public officials, communicating it to the public. It is neither publicity nor a stunt! https://t.co/T89c1K6PMi
— Abhishek Singh (@Abhishek_asitis) November 18, 2022
అభిషేక్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను ‘చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు’ ఎన్నికల సంఘం తెలిపింది. అతన్ని వెంటనే ‘జనరల్ అబ్జర్వర్‌గా తన విధుల నుంచి రిలీవ్ చేయచేస్తున్నట్లు, ఇంకా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల సంబంధిత విధులకు దూరంగా ఉంటాడం’టూ ఈసీ వెల్లడించింది. అతను వెంటనే తనకు బాధ్యతలను కేటాయించిన నియోజకవర్గాలను వదిలి, తన పోస్ట్‌ల గురించి తన పై అధికారులకు నివేదించాలని ఈసీ ఆదేశించింది. ఇంకా గుజరాత్‌లో అతనికి అందించిన అన్ని రకాల ప్రభుత్వ సౌకర్యాలను కారును ఈసీ వెనక్కి తీసేసుకుంది.
కాగా అభిషేక్ సింగ్ స్థానంలో మరో ఐఏయస్ అధికారి క్రిషన్ బాజ్‌పాయ్ నియమితులయ్యారు. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, 5 తేదీలలో రెండు విడతలుగా జరగబోతున్నాయి. వాటి ఫలితాలను డిసెంబర్ 8న ప్రకటిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి..