పేరులోనే ఉంది బలం పురుషులకు ఈ మొక్క ఓ వరం .. కనిపిస్తే విడిచి పెట్టకండి 

16 April 2025 

Pic credit- Social Media

TV9 Telugu

5000 ఏళ్ల నుంచే అతిబల మొక్కను ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తున్నార‌ని చ‌రిత్ర చెబుతోంది. ఈ చెట్టులో ప్రతి భాగం ఔష‌ధ గుణాలను కలిగి ఉంది.

అతిబ‌ల అంటే చాలా శ‌క్తివంత‌మైన‌ది, బ‌ల‌మైన‌ది అని అర్ధం.. పేరుకు త‌గిన‌ట్లుగా ఈ మొక్క అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది.  

అతిబ‌ల వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు, విత్త‌నాలు ఇలా ప్ర‌తి భాగంలోనూ ఔష‌ధ గుణాలున్నాయి. రకరకాల వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ హైప‌ర్ లిపిడెమిక్‌, అనాల్జెసిక్‌, యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ మ‌లేరియ‌ల్‌, డై యురెటిక్‌, హైపో గ్లైసీమిక్ గుణాలు ఉంటాయి.

అతిబ‌ల మొక్కలో ఫ్లేవ‌నాయిడ్స్ , అనేక ర‌కాల అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి వ్యాధులను తగ్గిస్తాయి.  

జ్వరం, నాడీ మండ‌ల వ్యాధులు, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, గాయాలు, పుండ్లు మానేందుకు అతిబ‌ల ఎంత‌గానో ప‌నిచేస్తుంది.

ప‌క్ష‌వాతం, కీళ్ల నొప్పులు, కుష్టు, క‌ళ్ల‌లో శుక్లాలు, నోట్లో అల్స‌ర్లు, విరేచ‌నాలు, కాళ్ల నొప్పులు, పాము కుట్టినప్పుడు, పైల్స్‌, గ‌నేరియా, ద‌గ్గు, ఆస్త‌మా, నపుంస‌క‌త్వం వంటి అనేక వ్యాధుల‌కు అతిబ‌ల ఎంత‌గానో ప‌నిచేస్తుంది.  

అతిబ‌ల చూర్ణం పురుషుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. వీర్యం వృద్ధి చెందుతుంది. న‌రాల బ‌ల‌హీన‌త త‌గ్గుతుంది.

అతిబ‌ల చూర్ణంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకోవ‌చ్చు.