ఏజెన్సీలో దొరికే ఈ కాయలకు తేలు విషాన్ని హరించే గొప్ప గుణం వీటి సొంతం..
15 April 2025
Pic credit- Getty
TV9 Telugu
గరుడ ముక్కు చెట్టును ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. తేలు విషాన్ని హరించడంలో ఈ మొక్క పని చేసినట్టు ఏ ఇతర మందులు పనిచేయవని నిపుణులు చెబుతున్నారు.
తేలు కుట్టినప్పుడు ఈ మొక్క ఆకుల రసాన్ని తేలు కాటుకు గురి అయిన ప్రాంతంలో వేసి ఆ దంచిన ఆకులను ఆ ప్రాంతంలో ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే తేలు విషం హరించుకుపోతుంది
*మూర్ఛ వ్యాధి రోగులకు గరుడ ముక్కకు మొక్క ఆకుల రసం మంచి మెడిసిన్. ఈ మొక్కల ఆకుల రసం నిద్రలేమికి.. క్షయ నివారణకు ఉపయోగిస్తారు.
కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే.. పండ్లను కాల్చిన బూడిద, కొబ్బరి నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని కాలిన గాయాలపై అప్లై చేయాలి.
కీళ్ల నొప్పులు, తలనొప్పి, ఛాతి నొప్పి వ్యాధుల నివారణ కోసం.. ఈ మొక్క వేరును ఒక గ్లాస్ నీటిలో వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి ఆ కషాయాన్ని తాగాలి.
వేర్లను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పొడిని ఒక గాజు గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి. ఈ నీటిని ఉదయమే తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ విత్తనాల నుంచి తీసిన నూనెను తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. చర్మం దురదలకు, చర్మవ్యాధులకు ఈ నూనె మంచి ఔషధం.