నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
టెక్నాలజీ యుగంలోనూ ప్రజల్లో మార్పు రావడంలేదు. అత్త ఒకప్పటి కోడలే అన్న విషయం మర్చిపోయి.. గంపెడాశలతో నట్టింట అడుగుపెట్టిన కోడలిపై వేధింపులకు పాల్పడుతున్నారు. కలకాలం కాపాడుకుంటానని ప్రమాణం చేసి తాళికట్టి తెచ్చుకున్న భర్త ప్రమాణాన్ని పక్కన పెట్టి భార్యను కట్నకానుకలంటూ కష్టపెడుతున్నాడు. కోడలిని కన్నబిడ్డలా చూసుకోవాల్సిన మామగారు కొడుక్కి వత్తాసుపలుకుతూ అదనపు కట్నం తెమ్మని వేధిస్తున్నాడు. మహిళలు ఎంత ఎదిగినా ఎక్కడో అక్కడ కోడలిగా, భార్యగా ఓడిపోతూనే ఉన్నారు. ఇప్పటికీ వరకట్న వేధింపులకు బలైపోతూనే ఉన్నారు. తాజాగా పెళ్లయి కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు తనువు చాలించిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లనేది ఓ టర్నింగ్ పాయింట్.
ప్రతి యువతి, యువకుడు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ వివాహజీవితంలోకి అడుగు పెడతారు. అలా తాళిబొట్టుతో.. పసుపు బట్టలతో అత్తింట అడుగుపెట్టింది శ్రుతి. కాళ్లపారాణి ఆరకముందే ఉరితాడుకు వేళాడింది. ఈ హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గొల్లపల్లిలో చోటు చేసుకుంది. హాజీపూర్ మండలం టికానపల్లి గ్రామానికి చెందిన కవిత, శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్న కూతురు శ్రుతిని అదే మండలానికి చెందిన పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి మార్చి నెల16వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో వరకట్నం కింద 9 తులాల బంగారం, రూ .5 లక్షల కట్నకానుకలు సమర్పించారు. వివాహ సమయంలో ఒప్పుకున్న విధంగానే అబ్బాయికి అన్ని లాంఛనాలతో నవ వధువును మెట్టినింటికి సాగనంపారు.

జ్యోతిష్యం చెబుతుండగా తుర్రుమన్న చిలక.. ఆ తర్వాత

ప్రమాదంలో గాయపడిన కొండముచ్చు.. స్థానికులు ఏం చేశారంటే

ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్

పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట..

రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూడగా..

భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో

సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
