కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
హర్యానాలోని ఫరీదాబాద్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల క్రితం పాఠశాల మైదానంలో ఆడుకుంటున్న కవిత కాలికి అనుకోకుండా బుల్లెట్ తగిలింది. దానిని రాయిగా భావించి చికిత్స చేయించుకోగా, గాయం మాసిపోయింది. అయితే, ఇటీవల కాలిపై కురుపు రాగా, అది పగలడంతో ఆ బుల్లెట్ బయటకు వచ్చింది. ఈ అద్భుతమైన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఓ బాలిక స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఉండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ బుల్లెట్ దూసుకొచ్చి.. ఆమె కాలి తొడలోకి దూసుకుపోయింది. అయితే ఏదో రాయి బలంగా తగిలినట్లు భావించిన బాలిక కుటుంబ సభ్యులు గాయానికి కట్టుకట్టి కొన్ని రోజులు చికిత్స అందించారు. ఆ తర్వాత గాయం మానింది. అయితే ఇది జరిగిన 20 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే ప్రాంతంలో కురుపు వచ్చింది. ఇటీవల ఆ కురుపు పగలడంతో అందులో నుంచి బుల్లెట్ బయటకు రావడం చూసి అందరూ షాకయ్యారు. ఈ విచిత్ర ఘటన హరియాణాలోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన కవిత కాలి తొడ భాగం నుంచి ఎటువంటి సర్జరీ లేకుండానే 20 ఏళ్ల క్రితం తగిలిన తుపాకీ బుల్లెట్ బయటకు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆమెకు తొడ భాగంలో కురుపు వచ్చింది. అది పగలడంతో అందులో నుంచి ఏకంగా బుల్లెట్ రావడం చూసి షాకైంది. నిజానికి.. కవితకు 12 ఏళ్ల వయసప్పుడు అంటే 2005లో మనేసర్‌లోని కోటా ఖండేవాలా అనే గ్రామంలోని స్కూల్‌లో 6వ తరగతి పరీక్షలు రాస్తున్న సమయంలో ఏదో పదునైన వస్తువు వచ్చి ఆమె కాలి తొడ భాగంలో తగిలింది. తీవ్రంగా రక్తం కారడంతో ఏదో రాయి తగిలిందని భావించి టీచర్లు ఆమెను ఇంటికి పంపారు. తల్లిదండ్రులు గాయానికి కట్టుకట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ గాయం మానిపోయింది. ఆ తర్వాత ఆమె తొడ భాగంలో నొప్పిగానీ, వాపుగానీ లేదు. 2 నెలల క్రితం సరిగ్గా అదే ప్రదేశంలో కురుపు రావడం… అది పెద్దదై పగిలి అందులో నుంచి బుల్లెట్ బయటకు రావడంతో అందరూ షాకయ్యారు. ఆమె చిన్న తనంలో చదువుకున్నపాఠశాల సమీపంలో సాయుధ దళ కాల్పుల శిక్షణ కేంద్రం ఉంది. ఆ సైనిక శిక్షణ శిబిరం నుంచే బుల్లెట్ దూసుకొచ్చి తనకు తగిలి ఉండవచ్చని భావిస్తున్నారు. బుల్లెట్ బయటకు వచ్చిన తర్వాత నొప్పి తగ్గిందని ఆమె తెలిపారు. ఇన్‌ఫెక్షన్ కాకుండా డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చాడని కవిత భర్త ప్రదీప్ సింగ్ తెలిపాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రతిరోజూ టమాటా తింటున్నారా.. ఇది మీకోసమే
Silver Hallmark: వెండి ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరి!
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త.. కట్ చేస్తే సీన్ రివర్స్
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ టికెట్ల జారీ రద్దు
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

