Silver Hallmark: వెండి ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరి!
బంగారం వలె వెండికి కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. పెరుగుతున్న వెండి ధరలు, వినియోగదారుల మోసాలను నివారించడానికి భారతీయ ప్రమాణాల మండలి (BIS) ఈ దిశగా కసరత్తు చేస్తోంది. HUID నంబర్ స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. చిన్న వెండి వస్తువులకు హాల్‌మార్కింగ్ సవాలుగా ఉన్నప్పటికీ, నిబంధనలు తీసుకురావడానికి BIS సిద్ధంగా ఉంది.
సాధారణంగా బంగారానికి హాల్ మార్క్ ఉంటుంది. నిపుణులు కూడా హాల్‌మార్క్ ఉన్న బంగారాన్నే కొనుగోలు చేయాలని సూచిస్తుంటారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిజానికి ఎన్నడూ లేనంతగా బంగారం కంటే కూడా వెండి ధర అనూహ్యంగా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో వినియోగదారులు మోసాల బారినపడకుండా దానికి కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు భారతీయ ప్రమాణాల మండలి వెల్లడించింది. ఇప్పటివరకూ వెండికి హాల్‌మార్కింగ్ అనేది తప్పనిసరి కాదు. కానీ ఇప్పటినుంచి వెండికి కూడా తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ ఉండాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయని, అందుకు తగ్గట్టుగా నిబంధనలు తీసుకురావడానికి ముందు అవసరమైన వనరుల గురించి అంచనా వేస్తుమని భారతీయ ప్రమాణాల మండలి డైరెక్టర్ జననరల్ సంజయ్ గార్గ్ వెల్లడించారు. ప్రస్తుతం స్వచ్ఛందంగా జరుగుతోన్న హాల్‌మార్కింగ్ వ్యవస్థలో భాగంగా వెండి వస్తువులపై హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నంబర్ కనిపిస్తోంది. దానిద్వారా వినియోగదారులు చెల్లించిన నగదుకు తగిన స్వచ్ఛత ఆయా ఆభరణాలు, వస్తువుల్లో ఉందా అనేది నిర్ధరించుకునేందు వీలు కలుగుతోంది. ఈ మార్కింగ్ ఉన్న వెండి వస్తువుల సంఖ్య 2024లో 31 లక్షలుగా ఉండగా.. 2025లో 51 లక్షలకు చేరిందని గార్గ్ తెలిపారు. అయితే, వెండిని కరిగించి, చిన్నపాటి ఆభరణాలు తక్కువ విలువలో చేస్తుంటారని.. వీటికి హాల్‌మార్కింగ్ ధ్రువీకరణ పత్రాలు అందించడం సవాలేనని బీఐఎస్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను 800, 835, 925, 958, 970, 990, 999 స్వచ్ఛతా ప్రమాణాలతో ఇస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త.. కట్ చేస్తే సీన్ రివర్స్
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ టికెట్ల జారీ రద్దు
మీరు ట్రైన్ ట్రైన్ మిస్సైతే.. అదే టికెట్‌తో వేరే రైలు ఎక్కోచ్చా
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

