Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాలు, సురక్షిత పెట్టుబడిగా బంగారంపై ఇన్వెస్టర్ల ఆసక్తి దీనికి కారణం. జనవరి 10న 10 గ్రాముల బంగారంపై రూ.1,150, కిలో వెండిపై రూ.7,000 పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి రేట్లను తెలుసుకోండి. కొత్త ఏడాదిలోనైనా ధరలు తగ్గుతాయని ఎదురుచూసిన గోల్డ్ ప్రియులకు షాకిస్తున్నాయి బంగారం, వెండి ధరలు.
కొత్త ఏడాదిలోనైనా ధరలు తగ్గుతాయని ఎదురుచూసిన గోల్డ్ ప్రియులకు షాకిస్తున్నాయి బంగారం, వెండి ధరలు. అంతర్జాతీయ పరిణామాలు.. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకోవడం వెరసి బంగారం, వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. జనవరి 10 శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,150లు పెరిగి రూ. 1,40,460 లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,050లు పెరిగి రూ.1,28,750లకు చేరింది. ఇక కిలో వెండిపై రూ.7000 పెరిగి రూ.2,75,000లు పలుకుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో శనివారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,40,610, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,900 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,460 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,28,750 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,40,460 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,28,750 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,75,000 పలుకుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

