దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
కొందరు రోడ్డుపై వాహనాలను వేగంగా నడుపుతుంటారు. ఆ సమయంలో ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయోనని ఇతర వాహనదారులు, పాదచారులు భయపడుతుంటారు. అలాంటిది ఓ డ్రైవర్ బస్సు నడుపుతున్న విధానం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇలాంటివి ఇండియాలోనే సాధ్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే...
రోడ్డు మీద ఓ బస్సు ప్రయాణికులతో దూసుకెళ్తోంది. డ్రైవర్ బస్సును నడిపే తీరు చూసి అందులోని ప్రయాణికులు ఒకింత భయపడ్డారు. ఎక్కడ బస్సు అదుపుతప్పుతుందో.. ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందారు. ఎందుకంటే ఆ బస్సులో గేర్ రాడ్ లేదు. ఓర్నాయనో.. మరి డ్రైవర్ గేర్ ఎలావేస్తున్నాడు…బస్సు ఎలా నడుపుతున్నాడు.. గేర్ రాడ్ ఏమైంది అనేగా మీ అనుమానం. బస్సు ఇంజిన్ బాక్స్ పక్కన ఉండాల్సిన గేర్ రాడ్ లేదు. దాంతో కండక్టర్ ఓ ఇనుప రాడ్ లాంటిది తీసుకొని ఆ గేర్‌రాడ్ రంద్రంలో పెట్టి డ్రైవర్ చెప్పిన ప్రకారం గేర్ మారుస్తున్నాడు. అలా కండక్టర్ గేర్ రాడ్ రంద్రం దగ్గర కూర్చుని గేర్ మారుస్తుంటే.. బస్సు డ్రైవర్ సీటులో కూర్చుని స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్నాడు. అలా చాలా దూరమే వారు బస్సును నడిపారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. నిజానికి ఈ వీడియో పాతదే అయినా మరోసారి పోస్ట్ చేయడంతో మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ వీడియోను రెండున్నర లక్షలమందికి పైగా వీక్షించారు. దాదాపు 2 వేలమంది లైక్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం
మైక్రోసాఫ్ట్ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్ బీమ్ ..కారులోకి చొచ్చుకెళ్లి బీభత్సం.. వీడియో