రెస్టారెంట్ వింత ఆఫర్.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ప్రత్యేక సందర్భాల్లో డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. తమ సంస్థను ప్రమోట్ చేసుకునే క్రమంలో కూడా భారీ రాయితీలు ఆఫర్ చేస్తుంటారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వీరు ప్రకటించే ఆఫర్లు ఒక్కోసారి బెడిసి కొడుతుంటాయి. అలాంటిదే ఓ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. ఓ టిఫిన్ సెంటర్ వారు వింత ఆఫర్‌ను ప్రకటించారు. ఇప్పుడది వివాదాస్పదంగా మారింది. థాయ్‌ల్యాండ్‌లోని చియాంగ్‌మాయి బ్రేక్ ఫాస్ట్ వరల్డ్ ఈ వింత ఆఫర్‌ను ప్రకటించింది.
దీని ప్రకారం, కస్టమర్లు ఎంత బక్కగా ఉంటే అంత ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్ చేస్తామని పేర్కొంది. ఈ డిస్కౌంట్ కావాలనుకున్న వాళ్లు సంస్థ ఏర్పాటు చేసిన గ్రిల్స్ మధ్య నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే టిఫిన్ సెంటర్‌కి వచ్చేవారంతా ఒకే సైజులో ఉండరు కదా.. అందుకే వారు వివిధ సైజుల వారు పట్టేందుకు వీలుగా గ్రిల్స్‌ను ఏర్పాటు చేశారు. ఆ గ్రిల్స్ మధ్యలోంచి వారు టిఫిన్ సెంటర్‌లోకి వెళ్లాలి. అలా వెళ్లినవారికి వారు వెళ్లిన గ్రిల్ విడ్త్‌ను బట్టి ఆఫర్ లభిస్తుంది. సన్నగా ఉన్న వారు మాత్రమే పట్టేంత సన్నగా ఉన్న గ్రిల్స్ మధ్య నుంచి వెళ్లగలిగితే వారికి 20 శాతం డిస్కౌంట్ ఇస్తారు. గ్రిల్స్ మధ్య గ్యాప్ ఎంత పెరిగితే అంత డిస్కౌంట్ తగ్గిపోతుంది. అంటే..మరీ లావుగా ఉండేవారి పరిస్థితి ఏంటి అంటే వారు ఈ డిస్కౌంట్ కోసం ప్రయత్నించకపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వారు ఆ గ్రిల్ మధ్యలోంచి వెళ్లలేరు కనుక. కస్ట్‌మర్స్ రాయితీ కోసం రాడ్స్ మధ్యలోంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వీడియో వైరల్ అవుతున్నాయి. ఈ ఆఫర్‌ను కొందరు సరదాగా తీసుకుంటే..మరికొందరు మాత్రం ఈ ఆఫర్‌తో లావుగా ఉన్నవారిని అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటివాటిని ప్రోత్సహించకూడదని
మరిన్ని వీడియోల కోసం
మైక్రోసాఫ్ట్ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్ బీమ్ ..కారులోకి చొచ్చుకెళ్లి బీభత్సం.. వీడియో
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
