AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..

మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..

Samatha J

|

Updated on: Apr 12, 2025 | 8:56 PM

‘‘మీకెంత ధైర్యం? యుద్ధంలో ఇజ్రాయెల్‌కు సాయపడేందుకు మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్, ఏఐ టెక్నాలజీలను దుర్వినియోగం చేస్తారా? పాలస్తీనియన్ల రక్తంతో సంబరాలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడండి. మైక్రోసాఫ్ట్‌ అందించిన టెక్నాలజీని ఉపయోగించి ఇజ్రాయెల్‌ మారణహోమానికి పాల్పడుతోందంటూ సీఈవో సత్యా నాదెళ్ల, బిల్‌ గేట్స్‌ను విమర్శించి వార్తల్లోకెక్కింది భారతీయ మూలాలున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ వనియా అగర్వాల్‌. అమెరికాలోని వాషింగ్టన్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో గతవారం జరిగిన సంస్థ 50వ వార్షికోత్సవంలో హఠాత్తుగా వేదిక వద్దకు వచ్చి అక్కడే ఉన్న సంస్థ తాజా, మాజీ సీఈవోలు సత్యా నాదెళ్ల, స్టీవ్‌ బామర్, బిల్‌ గేట్స్‌లనుద్దేశిస్తూ విమర్శించింది వనియా.

గాజా యుద్ధంలో గాజాలో 50,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా ఇజ్రాయెల్‌తో కాంట్రాక్ట్‌ను తెగతెంపులు చేసుకోండి అని వనియా బిగ్గరగా అరిచారు. దాంతో అక్కడి సిబ్బంది వెంటనే ఆమెను వెనక్కి లాక్కెళ్లారు. సంబంధిత వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఘటన తర్వాత వనియా మైక్రోసాఫ్ట్‌లోని ఏఐ విభాగ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అజూర్‌ క్లౌడ్, కృత్రిమ మేధ టెక్నాలజీలను వాడుకునేందుకు ఇజ్రాయెల్‌ మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్‌తో దాదాపు 1,144 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్‌ కుదుర్చుకుందని వనియా ఆరోపించారు. సొంత సంస్థపై ఆరోపణలు చేసిన వనియాపై పలువురు నెటిజన్లు విమర్శిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమెను పాలస్తీనాకు పంపించండి. హమాస్‌ వాళ్లు ఈమెను బాగా చూసుకుంటారు’, ‘ఈమె నకిలీ హిందువు. ఈమెకు జిహాదీతో పెళ్లిచేయాలి’, ‘ఈమెను అమెరికా నుంచి బహిష్కరించి ఇండియాకు పంపేయాలి’, ‘ఇండియాకు వద్దు. పాలస్తీనాకు పంపాలి’, ‘పాలస్తీనాకు పంపేయండి. హమాస్‌కు మద్దతుగా ఎంచక్కా కొత్త సాఫ్ట్‌వేర్, ఏఐ వ్యూహాలు సిద్ధంచేస్తుంది’ అంటూ వేర్వేరు రకాలుగా విమర్శించారు.

మరిన్ని వీడియోల కోసం

సూర్యుడికి సోదరుడు ఉన్నాడా..?వీడియో

 

ప్లేటు నిండా రొయ్యల కర్రీ..తినాలంటే వర్రీ వీడియో

 

క్రమం తప్పకుండా స్కూలుకి వస్తూ.. కొండముచ్చు ఏం చేస్తుందో చూడండి