ప్లేటు నిండా రొయ్యల కర్రీ..తినాలంటే వర్రీ వీడియో
ఆంధ్రా రొయ్యకు అమెరికా దెబ్బ తగిలింది. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్‌తో రొయ్యల రైతులు కుయ్యోమొర్రో అంటున్నారు. దీనికితోడు దళారుల దందాతో నిలువుదోపిడీకి గురవుతున్నారు. క్రాప్ హాలీడే పేరుతో ఆందోళనకు సై అంటున్నారు ఆక్వా రైతులు. ఇక ఏపీ ఆక్వా రంగాన్ని ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాశారు సీఎం చంద్రబాబు.ప్లేటులో రొయ్యల కర్రీ...తినాలంటే వర్రీ అయ్యేలా చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.
ఏపీ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రొయ్యలపై దిగుమతి సుంకం 3 శాతం నుంచి 26 శాతానికి పెంచేశారు దీంతో లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు ఇక లక్షా 26 వేలు కానున్నాయి. రవాణా, ప్యాకింగ్‌తో కలిపి ఎక్స్‌ట్రా బాదుడు 50 శాతానికి చేరుకుంటోంది. ఇక రొయ్య ధర కేజీకి రూ. 30 నుంచి 50 వరకు తగ్గించేసి రైతుల గుండెల్లో మరో గునపం గుచ్చారు ఎక్స్‌పోర్టర్స్. దీంతో రొయ్య రేటు ఒక్కసారిగా పడిపోయింది. అమెరికా పెంచిన ట్యాక్స్ ఈ నెల తొమ్మిది నుంచి అమలు కానుంది. రొయ్యల సాగు, ఎగుమతుల్లో ఏపీ అగ్రగామిగా ఉంది. ఏపీ GSDPలో రొయ్యల పరిశ్రమ వాటా 11 శాతం. 2 రోజుల క్రితం 100 కౌంట్ ధర రూ. 250 ఉంటే ఇప్పుడు 210 కి కొంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో రొయ్యలను సాగు చేస్తున్నారు. ఏపీ నుంచి అమెరికాకు ఏటా 17.2 లక్షల టన్నుల వనామీ రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం
భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో
వేసిన సీల్ వేసినట్లే ఉంటుంది..ఎలా కల్తీ చేస్తున్నారో చూసి పోలీసులే షాక్
పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో
కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వీడియో

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్‌లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
