Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో

రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో

Samatha J

|

Updated on: Apr 13, 2025 | 3:21 PM

వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు. సొంతంగా సంపదను సృష్టించిన కోటీశ్వరుడు. సొంతంగా ఓ దీవి, క్రూజ్‌ యాట్‌, 100 కోట్లు విలువ చేసే కార్లు అతని సొంతం. దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ మక్తూమ్ ప్రస్తుతం ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వచ్చారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపుతున్నారు. షేక్ హమ్దాన్ వ్యక్తిగత సంపద సుమారు 4 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 33,500 కోట్లు. వ్యక్తిగత పెట్టుబడులు, వ్యాపారాల నుంచి ఆర్జించిన సొమ్ము మాత్రమే. ఇది కాకుండా కుటుంబ ఆస్తిలో భాగం వేరే.

షేక్‌కి దుబాయ్‌లో అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. జబీల్ ప్యాలెస్, బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఆధునిక రెసిడెన్షియల్ యూనిట్లు ఆయన సొంతం. దుబాయ్‌ యువరాజు లైఫ్‌స్టైల్‌ ఎంత లగ్జరీగా ఉంటుంది? అతని ఇష్టాఇష్టాలేంటి? సంపద సృష్టికర్త జీవితంలో ఓ రోజు ఎలా గడుస్తుంది? సౌదీ అరేబియా తర్వాత, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యంత ధనిక అరబ్ దేశం. వాటిలో అబుదాబి, దుబాయ్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. అబుదాబికి ఎమిర్ అధ్యక్షుడిగా ఉంటే, దుబాయ్‌లో రాచరిక పాలన కంటిన్యూ అవుతోంది. షేక్ హమ్దాన్ 1982 నవంబర్ 14న దుబాయ్‌లో జన్మించారు. దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేఖా హింద్‌లకు అతను రెండో సంతానం. షేక్ హమ్దాన్ తన అత్యంత విలాసవంతమైన ప్యాలెస్‌కు మాత్రమే పరిమితం కాలేదు. దుబాయ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానించే వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. దుబాయ్‌ను నేటి స్థితికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అతని విలాసవంతమైన అభిరుచులు జీవనశైలి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

మరిన్ని వీడియోల కోసం

మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..

ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బీభత్సం.. వీడియో

నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా?వీడియో

యువతి సాహసం.. బెడిసి కొట్టడంతో ఇలా..!వీడియో